
ఏక్తా దివస్ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన సభలో స్వాతంత్ర్య సమరయోధులు నెహ్రూ, పటేల్ లను కించపరిచేలా బిజెపి నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడాటం సరికాదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సంస్థానాల విలీనానికి సంబంధించి నెహ్రూ, పటేల్ ఇద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వం నిర్ణయం మేరకే సంస్థానాల విలీనం జరిగిందని... ఆ ఖ్యాతిని ఏ ఒక్క వ్యక్తికో అపాదించడం తగదని అన్నారు. రాజకీయ లబ్ది కోసం స్వాతంత్య్ర ఉద్యమ నేతలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు.