Ponnala Lakshmaiah: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలపై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు లోపల దోస్తాన్ కొనసాగిస్తూనే బయట మాత్రం కుస్తీ పడుతున్నట్టు నటిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో నేడు రైతన్నలు పడుతున్న బాధలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కారణమని విమర్శించారు.
Ponnala Lakshmaiah: కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎప్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కారణంగా నేడు రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీపీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీజేపీ, టీఆర్ఎప్‌లపై తీవ్ర స్తాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. రైతుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్నిఅదోగతి పాలు చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అంతుచిక్కని పరిస్థితులు నెలకొన్నాయని పొన్నాల ఆవేదన వ్యక్తం చేసారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని అన్నారు. దాదాపు అరవై ఐదు లక్షల మంది వ్యవసాయదారులు పండించిన పంటకు మద్దతు ధర లేక, కొనుగోలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
Also Read: Coronavirus:పెరుగుతున్న కరోనా కొత్త కేసులు.. 11.6 శాతం అధికం
undefined
కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వంపైనా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ వేసిన చిటికెలతో దేశం ఏమాత్రం వృద్ది సాధించలేదని ధ్వజమెత్తారు. స్వాతంత్రం వచ్చినప్పుడు మొక్కజొన్నలు అమెరికా నుండి దిగుమతి చేసుకునే వాళ్ళం కానీ నేడు 128 దేశాలకు ఎగుమతి చేస్తున్నామంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ప్రధాని మోడీ వేసే చిటికెలతో మాత్రం కాదని పొన్నాల అన్నారు. నోట్ల రద్దు అంశాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. నోట్ల రద్దు సమయంలో సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీకి మద్దతు తెలిపాడని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం Gst 18% చేస్తామంటే మద్దతు తెలపలేదనీ, అయితే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీని 28 శాతం తీసుకుకొచ్చినప్పటకీ.. కేసీఆర్ మద్దతు ప్రకటించారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని తెలిపారు. రైతు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: Omicron Variant: మహారాష్ట్రలో కోలుకున్న ‘ఒమిక్రాన్’ బాధితుడు
తరాల మారిని చరిత్ర మారదనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరానికి ఉందని పొన్నాల అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాస్తవాలను చెప్పడంలో ముందుంటుందని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్‌ల మాదిరకి అబద్దాలు చెప్పదని అన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సాగు గురించి ప్రస్తావిస్తూ.. సీఎం కేసీఆర్ తన ఫామ్ లో మూడు వందల నలభై ఒక్క ఎకరాల్లో సన్న ధాన్యం వేయకుండా దొడ్డు ధాన్యం వేశాడనీ, ఇది అన్నదాతలను వంచించే చర్య కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశం, రాష్ట్రం ఈ ప్రగతిని సాధించాయని తెలిపారు. అనేక విషయాల్లో మైనార్టీలకు, ఎస్టీలకు ఆశ చూపి సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. 1972 నుండి నాలుగు వందల రూపాయల నుండి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభమయ్యాయని, ఇలాంటి చరిత్ర ఏ ప్రభుత్వంలో అయినా ఉందా అని పొన్నాల ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం గురించి మాట్లాడుతూ.... రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడున్నర పాలనలో ఏ గ్రామంలో నైనా ఒక్క డబుల్ బెడ్ రూమ్ కట్టించి ప్రజలకు ఇచ్చాడా? అని ప్రశ్నించాడు. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో 55 లక్షల ఇళ్లు కట్టించామన్నారు. కేసీఆర్ హామీలు మాటలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. కేసీఆర్‌ను గద్దె దించుతామనీ, ఆయనకు తగిన గుణపాటం కాంగ్రెస్ చెబుతుందని అన్నారు.
Also Read: Bipin Rawat:త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి.. యుద్ధవీరుడి జీవిత విశేషాలు..