బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల సమ్మె... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

By Arun Kumar PFirst Published Dec 9, 2021, 12:57 PM IST
Highlights

బొగ్గుగనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి తో పాటు అనేక కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో కార్మికుల ఇవాళ సమ్మెబాట పట్టడంతో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

కరీంనగర్: సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటికరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు కోల్ బ్లాక్స్ వేలానికి రంగం సిద్దమయ్యింది. ఇలా కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ గుర్తింపు సంఘం టిబిజికెఎస్ (TBGKS) తో పాటు జాతీయసంఘాలు ఎఐటియుసి (AITUC), హెచ్ఎంఎస్ (HMS), ఐఎన్టీయుసి (INTUC), బిఎంఎస్ (BMS), సిఐటియు (CITU), విప్లవకార్మిక సంఘాల జెఎసి మూడురోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా (Peddapalli district) రామగుండం రీజీయన్ లో మొదటిరోజు సమ్మె (strike) కొనసాగుతోంది. 

కార్మికుల సమ్మెతో రామగుండం రీజీయన్ (ramagunda region) లో ఆరు భూగర్భగనులు, నాలుగు ఓపెన్ కాస్డ్ గనుల్లో పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. నిత్యం కార్మికులతో కళకళలాడే గని ఆవరణ బోసిపోయింది. అత్యవసర పనులు నిర్వహించే కార్మికులు తప్ప కార్మికులు విధులకు హాజరుకాలేదు. విధులను బహిష్కరించిన కార్మికులు సమ్మెను విజయవంతం చేయాలంటు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. 

వీడియో

సింగరేణి (singareni) లో నాలుగు బొగ్గు బ్లాక్స్ ప్రైవేటీకరణ  (coal blacks privatisation)ను ఉపసంహరించుకోవాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేసారు. వెంటనే బొగ్గు బ్లాక్ ల వేలంపాటను నిలిపివేయాలని కోరారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్మికులను రోడ్డున పడవేస్తున్నాయని ఆరోపించారు. కార్మికుల సమ్మెతో రామగుండం రీజియన్ లో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి విఘాతం కలిగింది. 

read more  యాజమాన్యంతో సింగరేణి కార్మికుల చర్చలు విఫలం, బంతి కేంద్రం కోర్టులో.... సమ్మె యథాతథం

ఇదిలావుంటే ఇప్పటికే సింగరేణి పరిధిలోని నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర  ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బుధ‌వారమే సీఎం లేఖ రాశారు. 

తెలంగాణలోని సింగరేణి ఏడాదికి 65 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గును ఉత్ప‌త్తి చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే బొగ్గు వల్ల ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గల థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలు తీరుతున్నాయని తెలిపారు. అక్కడున్న థర్మల్ పవర్ సేష్టన్ల అవసరాలను సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

read more  సింగరేణిలో సమ్మె సైరన్: కార్మిక సంఘాలతో అధికారుల చర్చలు

 తెలంగాణ  రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉందని తెలిపారు. తరువాత 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. కాబట్టి విద్యుత్ తయారు చేసేందుకు బొగ్గు సరఫరా అవసరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం  వేలం వేయాలని భావించిన జేబిఆర్ఓసి-3, శ్రావన్ పల్లి ఓసి, కోయగూడెం ఓసి-3 మరియు కెకె -6 యుజి బ్లాక్ ల వల్ల సింగరేణి అవసరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి వేలం వేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పీఎం మోదీని లేఖ ద్వారా కోరారు సీఎం కేసీఆర్. 
 

click me!