
ఖమ్మంలో మంత్రి కెటిఆర్ ఐటి పార్కుకు శంకుస్థాపన చేశారు సరే. మరి కరీంనగర్ ఐటి పార్కును ఎందుకు విస్మరించారు? నీకు, నీ తండ్రికి రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ జిల్లాపై ప్రేమ లేదా? ఎందుకు కరీంనగర్ మీద వివక్ష చూపుతున్నారు. ఖమ్మం ముద్దు కరీంనగర్ గలీజు అయిందా?
ఖమ్మంలో ఆర్భాటంగా మంత్రి కెటిఆర్ ఐటి పార్కుకు శంకుస్థాపన చేయడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఖమ్మం ఐటి పార్కు ప్రారంభించిన కెటిఆర్ కరీంనగర్ ఐటి పార్కు గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. కెటిఆర్ కు, ఆయన తండ్రి కెసిఆర్ కు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
కరీంనగర్ లో కాంగ్రెస్ హయాంలోనే ఐటి పార్కును ప్రతిపాదించామని పొన్నం వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది కబట్టే దాన్ని మీరు పట్టించుకోవడంలేదా అని నిలదీశారు. కరీంనగర్ నుంచి రోజుకో సంస్థ తరలిపోతుంటే ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారంటూ పొన్నం ప్రశ్నించారు.