రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు కన్నుమూత

By SumaBala Bukka  |  First Published May 12, 2022, 6:59 AM IST

రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి. నరసింహారావు బుధవారం అర్థరాత్రి దాటాక 1.50 గంలకు తుదిశ్వాస విడిచారు. 


హైదరాబాద్ : రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి దాటాక 1.50 గంలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు  తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై నరసింహారావు అనేక పుస్తకాలు రచించారు. 

సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. స్వస్థలం క్రిష్ణాజిల్లా పెద్దపాలపర్రు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు. జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఆయన కృషి ఎంతో ఉంది.  

Latest Videos

click me!