టీఎస్ఎస్పీడీసీఎల్‌లో చరిత్ర సృష్టించిన యువతి.. లైన్ ఉమెన్‌గా ఉద్యోగం (వీడియో)

Siva Kodati |  
Published : May 11, 2022, 10:30 PM IST
టీఎస్ఎస్పీడీసీఎల్‌లో చరిత్ర సృష్టించిన యువతి.. లైన్ ఉమెన్‌గా ఉద్యోగం (వీడియో)

సారాంశం

టీఎస్ఎస్పీడీసీఎల్‌ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ లైన్ ఉమెన్‌గా ఎంపికై రికార్డుల్లోకెక్కింది. బబ్బూరి శిరీష అనే యువతి ఈ ఘనత అందుకుంది. ఈ మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. 

టీఎస్ఎస్పీడీసీఎల్‌లో (tsspdcl) ఓ యువతి చరిత్ర సృష్టించింది. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా శిరీష (sirisha) అనే యువతి చరిత్ర సృష్టించింది. ఈ మేరకు లైన్ ఉమెన్‌గా (line woman) ఉద్యోగం పొందిన శిరిషకు నియామక పత్రాన్ని అందించి అభినందించారు మంత్రి జగదీశ్ రెడ్డి (jagadish reddy) . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బబ్బూరి శిరీష అనే మహిళ టీఎస్ ఎస్పీడిసిఎల్ సంస్థలో ఉద్యోగుల నోటిఫికేషన్‌లో భాగంగా లైన్ ఉమెన్‌గా అప్లై చేసుకుంది. దీనిలో భాగంగా ఇవాళ ఆమె జాబ్ సంపాదించిందని చెప్పారు. చరిత్రలో శిరీష నిలిచిపోతుందని.. గతేడాది తీసుకున్న నిర్ణయం మేరకు 200 పైచిలుకు లైన్ ఉమెన్‌లను ట్రాన్స్ కోలో తీసుకున్నామని జగదీష్ రెడ్డి తెలిపారు. కానీ టీఎస్ ఎస్పీడీసీఎల్‌లో తొలిసారిగా మహిళను లైన్ ఉమెన్ తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. 

దేశ చరిత్రలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం ఇచ్చిన సంస్థగా టీఎస్ ఎస్పీడిసిఎల్ నిలుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంనేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగడునా అడ్డుకుంటోందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కరెంట్ కొనకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని మంత్రి ఎద్దేవా చేశారు. అయినా ఎక్కడా ఇబ్బందులు రాకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని , రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత (coal crisis) లేదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) అమావాస్య రోజు హెలికాప్టర్ వేసుకొని వస్తే దేశంలో ఎక్కడ వెలుగులు కనిపిస్తే అదే తెలంగాణ రాష్ట్రమంటూ ఆయన చురకలు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎంకు లోబడి అప్పులు తీసుకోవాలని అనేక ఇబ్బందులు పెడుతోందన్నారు. అభివృద్ధిలో ముందున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఎద్దేవా చేశారు. అయినా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో సీఎం కేసీఆర్ తెలుసునని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.

లైన్ ఉమెన్‌గా ఎంపికైన శిరీష మాట్లాడుతూ.. ఒక మహిళగా టీఎస్ ఎస్పీడిసిఎల్ సంస్థలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చని.. తాను కష్టపడి పనిచేసి సంస్థకు పేరు తెస్తానని శిరీష పేర్కొన్నారు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించిన సంస్థకు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి ,సీఎండీ రఘుమారెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

 

"

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే