ఇవాళ తెల్లవారుజామున జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఆగివున్న ఇసుకలారీని పోలీస్ వాహనం ఢీకొట్టడంతో ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు.
భూపాలపల్లి: ఆదివారం తెల్లవారుజామున జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న ఇసుకలారీని ఢీకొట్టడంతో ఎస్సైతో సహా నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. Bhupalapalli పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం గ్రామానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఉదయం పొగమంచు కారణంగా పోలీస్ వాహనాన్ని నడుపుతున్న కానిస్టేబుల్ రోడ్డుపక్కన ఆగివున్న ఇసుక లారీని గుర్తించలేకపోయాడు. దీంతో వేగంగా వెళ్లిన పోలీస్ వాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
read more డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలు సీజ్ చేయద్దు.. : హై కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్..
ఈ ప్రమాదంలో ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడ్డ పోలీసులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అందరి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం ధ్వంసమయ్యింది.