ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపం... దీపావళికి ఇంటికి వెళ్ళిన నిరుద్యోగి ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Nov 07, 2021, 08:08 AM ISTUpdated : Nov 07, 2021, 08:18 AM IST
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపం... దీపావళికి ఇంటికి వెళ్ళిన నిరుద్యోగి ఆత్మహత్య

సారాంశం

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న యువకుడు ఎంతకూ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

నల్గొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఎంతకూ భర్తీ నొటిఫికేషన్లు వెలువడక నిరుద్యోగ యువత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇలా ఉద్యోగం ఇంకెప్పుడు సాధిస్తావంటూ కుటుంబసభ్యులు, స్నేహితుల ఒత్తిడి ఎక్కువవడంతో ఓ నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.  

telangana రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని భావించి చాలామంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా ఏళ్లుగా ప్రిపరేషన్ సాగిస్తున్నా అడపాదడపా కొన్ని నోటిఫికేషన్లు తప్ప అందరూ ఊహించినట్లుగా భారీగా ఉద్యోగాల భర్తీ మాత్రం జరగలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆశ పెట్టుకున్న నిరుద్యోగ యువత ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  

నల్గొండ జిల్లాలో unemployed youth suicide కు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. nalgonda district చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామానికి చెందిన సపావట్ బూర, కమ్మ దంపతుల కుమారుడు నరేష్(30) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్న పట్టుదలతో ప్రిపరేషన్ ప్రారంభించాడు. hyderabad లో వుంటూ శిక్షణ తీసుకున్న అతడు కొన్నేళ్ళుగా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నిస్తూనే వున్నాడు. 

READ MORE  నిరుద్యోగుల ఆత్మహత్యలు:ప్రగతిభవన్ ముందు యూత్ కాంగ్రెస్ ధర్నా, ఉద్రిక్తత

కొన్నాళ్లక్రితమే తండ్రి చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడినా నరేష్ ప్రిపరేషన్ మాత్రం కొనసాగిస్తూనే వున్నాడు. ఈ క్రమంలో తాజాగా దీపావళి పండగ కోసం స్వగ్రామానికి విచ్చేసిన అతడికి కుటుంబసభ్యులు, స్నేహితుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురయ్యింది. ఇంకెంతకాలం చదువుతావు... ఉద్యోగం ఎప్పుడొస్తుంది... నీకంటే చిన్నోళ్ల పెళ్లిళ్లు అయిపోతున్నాయి.... నువ్వు ఎప్పుడు చేసుకుంటావ్ అంటూ   వారు అడగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 

తీవ్ర మనస్తాపానికి గురయిన నరేష్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రలో వుండగా సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందే ''అమ్మా నన్ను క్షమించు... నేను నాన్న దగ్గరకు వెళ్లిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నాకు బతకాలని లేదు. అందకే ఆత్మహత్య చేసుకుంటున్నా'' అంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టాడు.  

read more  కామారెడ్డి రైతు మృతిపై వివాదం: సహజ మరణమంటూ నివేదిక.. కలెక్టర్లు బానిసలంటూ కాంగ్రెస్ ఆగ్రహం

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో నిరుద్యోగి ఆత్మహత్యతో నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. 

ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేక పోవడం తో మనస్తాపానికి లోనయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరువకముందే మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం