అధికార పార్టీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, రాజేంద్రనగర్ లో ఉద్రిక్తత

By Arun Kumar PFirst Published Aug 24, 2018, 4:21 PM IST
Highlights

అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీని చేపడుతున్నారని పేర్కొంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో రాజేంద్రనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 

అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీని చేపడుతున్నారని పేర్కొంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో రాజేంద్రనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజేంద్ర నగర్ మైలార్ దేవుపల్లిలో స్థానిక కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఇవాళ కార్యకర్తలతో కలిసి ఓ ర్యాలీని తలపెట్టాడు. మైలార్‌దేవుపల్లి నుంచి ఆరె మైసమ్మ టెంపుల్ వరకు ర్యాలీ  చేపట్టేందుకు అంతా సిద్దం చేసుకున్నారు. అయితే ఇంతలో స్థానిక పోలీసులు వచ్చి ఈ ర్యాలీకి అనుమతి లేదని పేర్కొంటూ అడ్డుకున్నారు. దీంతో కాస్సేపు పోలీసులకు,టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా శాంతియుతంగా ర్యాలి జరుపుకుంటామని హామీ
ఇచ్చినా పోలీసులు ర్యాలీకి అంగీకరించడం లేదని నాయకులు వాపోతున్నారు.

ఈ గందగోళం రోడ్డుపైనే చోటుచేసుకోవడంతో భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాపిక్ ను క్లియర్ చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
 

 

click me!