కేటీఆర్‌తో వాట్సాప్ సీఈఓ భేటీ, ఆపరేషనల్ సెంటర్ ఏర్పాటుకు సానుకూలం

By narsimha lodeFirst Published Aug 24, 2018, 3:44 PM IST
Highlights

వాట్సాప్ సీఈఓ క్రిష్ డానియల్స్ , ఫేస్‌బుక్ ఇండియా విభాగం పబ్లిక్ పాలసీ డివిజన్ హెడ్ శివనాథ్ తుక్రాల్‌లు  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ తో గురువారం నాడు సమావేశమయ్యారు.


హైదరాబాద్: వాట్సాప్ సీఈఓ క్రిష్ డానియల్స్ , ఫేస్‌బుక్ ఇండియా విభాగం పబ్లిక్ పాలసీ డివిజన్ హెడ్ శివనాథ్ తుక్రాల్‌లు  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ తో గురువారం నాడు సమావేశమయ్యారు.

తెలంగాణలోని హైద్రాబాద్‌లో వాట్సాప్ ఆపరేషనల్  సెంటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ వాట్సాప్ సీఈఓ ను కోరారు. ఈ మేరకు వాట్సాప్ సీఈఓ క్రిష్  సానుకూలంగా స్పందించారు.

ఇప్పటికే హైద్రాబాద్ కేంద్రంగా ప్రముఖ ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ తరుణంలో వాట్సాప్ కూడ  తమ ఆపరేషనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే విషయంలో సానుకూలంగా స్పందించడంపై  తెలంగాణ సర్కార్  హర్షం వ్యక్తం చేసింది.

హైద్రాబాద్  ఐటీ హాబ్ గా తీర్చి దిద్దేందుకు  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి కేటీఆర్ వివరించారు. టీ హాబ్ గురించి కేటీఆర్ వివరించారు. రానున్న రోజుల్లో తెలంగాణ సర్కార్ చేపట్టనున్న పలు పథకాల గురించి  మంత్రి వారికి వివరించారు.

click me!