Huzurabad Bypoll: పోలింగ్ కు సర్వం సిద్దం... సిబ్బందికి కలెక్టర్ కర్ణన్ కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published Oct 29, 2021, 12:30 PM IST
Highlights

హుజురాబాద్ నియోజవకర్గంలో శనివారం జరగనున్న పోలింగ్ కోసం ఏర్పాట్లన్ని పూర్తిచేసినట్లు కరీంనగర్ కలెక్టర్  కర్ణన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో అత్యంత కీలకమైన పోలింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ యంత్రాగానికి ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలతో పాటు ఎన్నికల విధుల గురించి ఈసీ నుండి ఖచ్చితమైన ఆదేశాలు అందాయి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి సూచనలిచ్చిన ఈసీ ఆయా చోట్ల పోలీసు బలగాలను కూడా ఎక్కువగా మొహరించారు.  

karimnagar జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్, రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి రేపటి పోలింగ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లుండాలని వారు ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు ఆదేశించారు. 

Huzurabad లోని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తరలించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇవాళ సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది కూడా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. శనివారం తెల్లవారుజామునే polling కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసుకుని ఓటింగ్ ప్రారంభించనున్నారు.  

వీడియో

హుజురాబాద్ నియోజకవర్గంలో శనివారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు. నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాల్లో ఈ పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,37,036 మంది ఓటర్లుండగా వారిలో పురుషులు 1,17,933 కాగా స్త్రీలు 1,19,102. ఇతరులుగా కేవలం ఒకే ఒక్క ఓటరు ఉన్నారు.

read more  Huzurabad Bypoll: ఆ పార్టీల డబ్బులు అందలేదంటూ ఓటర్ల ఆందోళన... గొడవకుదిగిన మహిళలు (వీడియో)

హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనాలు అనుసరించి నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కర్ణన్ తెలిపారు. ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 1715 మంది సిబ్బందిని ఈ ఎన్నిక కోసం వినియోగిస్తున్నారు. 

శుక్రవారం సాయంత్రం లొగా పోలింగ్ సిబ్బంది తమకి కెటాయించిన సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకి చేరుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ లైవ్ వెబ్ కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేసామన్నారు.

read more  Huzurabad bypoll: ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా

పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు సానిటైజ్ చేసుకొనేలా ఏర్పాటు చేసారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ వర్కర్స్ థర్మామీటర్ తో టెంపరేచర్ ని పరీక్షించి లోపలికి పంపుతారు. ఓటు హక్కు వినియోగించుకునే కోవిడ్ పేషెంట్ లకి ప్రత్యేక పిపిఈ కిట్లు,కుడి చేతికి గ్లౌజులు సిద్దం గా ఉంచారు.

సోషల్ మిడియాలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మవద్దని ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు,స్వేచ్ఛా గా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. 3880 మంది పోలిసులతో పటిష్ఠమైన బందోబస్తుని ఏర్పాటు చేసారు. 

click me!