సరూర్ నగర్ లో బుధవారం రాత్రి జరిగిన పరువుహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన భర్తమీద ఐదుగురు వ్యక్తులు దాడిచేసి హతమార్చారని హతుడి భార్య చెబుతోంది.
హైదరాబాద్ : telangana రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్ లో జరిగిన honour killing కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు తన భర్తపై దాడి చేసి.. తలపై కొట్టి చంపారని హతుడి భార్య ఆరోపిస్తున్నారు. నడిరోడ్డుపై Iron rods తో కొట్టి చంపారని చెప్పారు. చావైనా బ్రతుకైనా నీతోనే అని తన భర్తతో చెప్పినట్లు ఆమె తెలిపారు. ఐదుగురిలో ఒకతను తనను దొబ్బేస్తున్నాడని, ఇతరులు తనపై attack చేశారని ఆమె చెప్పారు. కొద్ది రోజుల క్రితం ప్రేమవివాహం చేసుకున్న జంటపై ఐదుగురు వ్యక్తులు సరూర్ నగర్ చెరువుకట్ట వద్ద దాడి చేశారు.
పదేళ్లుగా నాగరాజుతో తనకు పరిచయం ఉందని ఆయన భార్య అశ్రిన్ చెప్పారు. తనను పెళ్లి చేసుకుంటే చంపుతారని నాగరాజుకు తెలుసునని, అయినా పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పారు. తన భర్త నాగరాజుతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తుంటే తనను బైక్ నుంచి పడేసి దాడి చేశారని ఆమె చెప్పారు. దాడి జరుగుతుంటే ఎవరూ కాపాడడానికి ముందుకు రాలేదని, కాళ్లు పట్టుకుని అందరినీ వేడుకున్నానని ఆమె చెప్పారు. పెళ్లి చేసుకుంటే చంపుతారని మూడు నెలల పాటు తాను నాగరాజుకు దూరంగా ఉన్నానని, చివరికి అంగీకరించి పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పారు.
undefined
ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి హైదరాబాద్ లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి గడ్డపారతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య తీవ్రంగా గాయపడింది. ఈ అమానుష ఘటన హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చోటుచేసుకుంది. మృతుడిని రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో నివాసం ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి బి.నాగరాజు (25)గా, గాయపడిన యువతిని సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు సయ్యద్ సుల్తానా ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే ఇరు వర్గాలపెద్దలు వారి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో వారిద్దరూ పెద్దలను వ్యతిరేకించి జనవరి 31 2022న లక్ష్మీనగర్ లోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు వివాహానికి అడ్డు చెప్పారు. ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించారు.
ప్రస్తుతం ఈ జంట రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో నివాసముంటున్నారు. నాగరాజు ఓ కార్ల షోరూంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. అంతా సాఫీగానే ఉందని భావించిన ఆ యువజంట జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ద్విచక్ర వాహనంపై సరూర్ నగర్ వైపు వెళ్తుండగా సరూర్నగర్ మున్సిపల్ కార్యాలయం పంజాల అనిల్ కుమార్ కాలనీ వద్ద గుర్తు తెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చిన నాగరాజు వాహనాన్ని అడ్డగించారు. ఇనుప రాడ్తో నాగరాజుపై దాడి చేశారు. రద్దీగా ఉండే రోడ్డుపై జనాలు చూస్తుండగానే నాగరాజును కత్తితో పొడిచాడు. గమనించిన వాహనదారులు దంపతులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ తీవ్ర రక్తస్రావమై నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా సంఘటనలో తీవ్రంగా గాయపడిందని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
హత్యకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి క్లూస్ టీం కూడా చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారని చెప్పారు. పరువు హత్య గా భావించిన పోలీసులు సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యుల హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.