రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్: ఛలో పాల్వంచకు ప్లాన్, నేడు సీఎల్పీ అత్యవసర భేటీ

Published : Jan 09, 2022, 09:40 AM IST
రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్: ఛలో పాల్వంచకు ప్లాన్, నేడు సీఎల్పీ అత్యవసర భేటీ

సారాంశం

పాల్వంచ ఘటనపై సీఎల్పీ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగే అవకాశం ఉంది. మరో వైపు వనమా బాధితులకు కూడా అండగా నిలవాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. 

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని palwancha లో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వనమా రాఘవ బాధితులకు Congress పార్టీ అండగా నిలవాలని భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం అత్యవసరంగా సమావేశం కానుంది.ఈ సమావేశంలో  పాల్వచం ఘటనపై Clpలో నిర్ణయం తీసుకోంటారు.ఈ నెల 3వ తేదీన పాల్వచంలోని తూర్పు బజారులో Ramakrishna  తన భార్య శ్రీలక్ష్మి సహా ఇద్దరు కూతుళ్లు సాహితీ, సాహిత్యలతో కలిసి ఆత్మహత్య చేసకొన్నాడు. తాము ఆత్మహత్య చేసకోవడానికి కొత్తగూడెం ఎమ్మెల్యే vanama venkateswara rao తనయుడు వనమా రాఘవేందర్ అంటూ  సెల్ఫీ వీడియోను రామకృష్ణ రికార్డు చేశాడు. సెల్ఫీ వీడియోతో పాటు సూసైడ్ నోట్ కూడా రాశాడు.  

కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో vanama raghavendra rao  అరాచకాలకు అనేక కుటుంబాలు బలయ్యాయని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే పోలీసుల వద్దకు చేరిన ఫిర్యాదులు ఏడు మాత్రమే.

వనమా రాఘవేందర్ ను శుక్రవారం నాడు అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆయనను జైలుకు తరలించారు. అయితే kothagudem అసెంబ్లీ నియోజకవర్గంలో వనమా రాఘవేందర్ అరాచకాలతో ఇబ్బంది పడిన కుటుంబాలకు అండగా నిలవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే Jagga reddy అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని పీఎఓల్పీ నేత  mallu bhatti vikramarka ను కోరారు. ఇవాళ సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని కోరారు.  

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయనుంది. మరో వైపు వనమా రాఘవేందర్ అరాచకాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది.ఈ విషయాలపై సీఎల్పీ సమావేశంలో చర్చించనున్నారు. అవసరమైతే ఛలో పాల్వంచ కార్యక్రమానికి కూడా సీఎల్పీ పిలుపునిచ్చే అవకాశం ఉందనే సమాచారం. 

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి తొలుత తనకు ఎలాంటి సంబంధం లేదని వనమా రాఘవేందర్ ప్రకటించారు.ఈ మేరకు వీడియోను మీడియాకు పంపారు. మరో వైపు హైద్రాబాద్ లో పలు మీడియా చానెల్స్ కు  కూడా ఆయన ఇంటర్వ్యూలు  ఇచ్చారు. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకొన్న సెల్ఫీ వీడియో మీడియాలో ప్రసారం కావడంతో వనమా రాఘవేందర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసే వారి సంఖ్య పెరిగింది. 

వనమా రాఘవేందర్  కోసం పోలీసుల గాలింపు కూడా ముమ్మరమైంది. శుక్రవారం నాడు వనమా రాఘవేందర్ ను టీఆర్ఎస్ నుండి ఆ పార్టీ  సస్పెండ్ చేసింది.  శుక్రవారం నాడు రాత్రి వనమా రాఘవేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆత్మహత్యకు ముందు రామకృష్ణ మరో సెల్పీ వీడియోను కూడా రికార్డు చేశాడు. ఈ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.  రాఘవేందర్ వేధింపులను తట్టుకోలేకే రామకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వనమా రాఘవేందర్ బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.భవిష్యత్తులో వనమా రాఘవేందర్ తో ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందకు వీలుగా రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


 


 

PREV
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu