ఆస్మా బేగం శరీరంలో బుల్లెట్: తెరపైకి జుబేర్ కాల్పుల కేసు

Published : Dec 24, 2019, 10:30 AM ISTUpdated : Dec 30, 2019, 11:04 AM IST
ఆస్మా బేగం శరీరంలో బుల్లెట్: తెరపైకి జుబేర్ కాల్పుల కేసు

సారాంశం

ఆస్మా బేగం కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్మా బేగం తండ్రి పనిచేస్తున్న ఫంక్షన్ హాల్ యజమాని కొడుకు జుబేర్ పై గతంలో ఉన్న కేసు విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. 

హైదరాబాద్: ఆస్మా బేగం కేసులో కొన్ని సంచలన విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్మా బేగం కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also read: ఆస్మా వెన్నులో బుల్లెట్: సంచలన విషయాలు

వెన్నుముక నొప్పితో  ఉన్న ఆస్మా బేగం శరీరం నుండి బుల్లెట్ నుండి నిమ్స్  వైద్యులు ఈ నెల 21వ తేదీన బుల్లెట్‌ను వెలికి తీశారు.ఆస్మా బేగం తండ్రి కింగ్స్ పంక్షన్ హాల్ లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కింగ్స్  ఫంక్షన్  హాల్  యజమాని కొడుకు జుబేర్ గతంలో ఓ పెళ్లి బరాత్ సమయంలో కాల్పులు జరిపాడు.

ప్రస్తుతం ఈ కేసు కూడ పోలీసుల దృష్టికి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా ఆస్మా బేగం కుటుంబసభ్యులు ఈ విషయమై ఎందుకు పోలీసులకు చెప్పలేదని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also read:వెన్నునొప్పి ఆపరేషన్ చేస్తే బుల్లెట్ దొరికింది

ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆస్మా బేగం శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు. జుబేర్ గతంలో పెళ్లి  వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని కాల్పులు జరిపాడు. 

ఆ సమయంలో   ఈ ఘటన పెద్ద సంచలనమే. దీంతో అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఆస్మాబేగం కాల్పుల వ్యవహరాం వెలుగు చూడడంతో జుబేర్  కాల్పుల కేసును కూడ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని  పోలీసులు భావిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు