సహజీవనం చేశాడు.... తీసుకున్న బాకీ తీర్చమన్నందుకు

By Siva KodatiFirst Published Mar 12, 2020, 10:27 PM IST
Highlights

చౌటుప్పల్‌లో సంచలనం కలిగించిన మీసాల జయసుధ కేసులో పోలీసుల దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

చౌటుప్పల్‌లో సంచలనం కలిగించిన మీసాల జయసుధ కేసులో పోలీసుల దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన మీసాల జయసుధ టైలరింగ్ చేస్తూ జీవిస్తుంది.

అవివాహిత అయిన జయసుధ దండుమల్కాపురం గ్రామానికి చెందిన వివాహితుడు మీసాల శేఖర్‌ను ప్రేమించి అతనితో సహజీవనం చేసింది. వీరికి ఇద్దరు కుమారులు చరణ్, సిద్ధూ ఉన్నారు.

ఈ మధ్యకాలంలో వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తొమ్మిదేళ్ల సహజీవనానికి తెరదించుతూ విడిపోయారు. అప్పటి నుంచి జయసుధ తల్లిగారి గ్రామ సమీపంలోని ఎల్లంబావిలో తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది.

Also Read:పెళ్లైన 2 నెలలకే నవ వధువు అదృశ్యం: ఏడేళ్ల తర్వాత ప్రియుడితో ఇలా, షాకైన భర్త

ఈ క్రమంలో కొయ్యలగూడెం గ్రామానికే చెందిన తాపి మేస్త్రీ ఊదరి రమేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగేళ్లు ఇద్దరు సన్నిహితంగా మెలిగారు.

ఈ నేపథ్యంలో రమేశ్‌కు చుండూరు మండలం తేరట్‌పల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. దీంతో రమేశ్, జయసుధ మధ్య మాటలు, రాకపోకలు నిలిచిపోయాయి. అయితే పెళ్లికి ముందు జయసుధ వద్ద రమేశ్ కొంత డబ్బు తీసుకున్నాడు.

ఈ డబ్బు గురించి ఆమె అతనికి ఫోన్ చేస్తున్నప్పటికీ ఎత్తేవాడు కాదు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జయసుధ ఇంటికి దగ్గర్లోనే రమేశ్ మేస్త్రీ పనులు చేస్తుండటంతో ఆమెపై మనసు పడ్డాడు. ఇంటికి వెళ్లి తనతో సన్నిహితంగా ఉండాలంటూ జయసుధను వేధించసాగాడు.

అయితే ఆమె అతనిని దగ్గరికి రానివ్వకపోవడం, బాకీ డబ్బుల కోసం ఒత్తిడి తెస్తుండటంతో రమేశ్‌కు తీవ్ర ఆగ్రహం కలిగింది. జయసుధను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ప్లాన్‌లో భాగంగా ఈ నెల 9న మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చాల్సిందిగా బలవంతం చేశాడు.

అందుకు జయసుధ అంగీకరించకపోగా, అరుస్తానని బెదిరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రమేశ్ ఆమె చెంపపై కొట్టడంతో జయసుధ కిందపడిపోయింది.

ఆ వెంటనే ఆమె మెడకు చున్నీని బిగించి హత్య చేశాడు. అయితే అదే సమయంలో పక్కింట్లో నివసించే ఓ వ్యక్తి అటుగా రావడాన్ని గమనించిన రమేశ్.. జయసుధ ఇంటి తలుపుకు గడియపెట్టి పారిపోయాడు.

Also Read:అమ్మకి ఇద్దరితో అక్రమ సంబంధం.. ఇంట్లో బంధించి...

కొద్దిసేపటి తర్వాత మృతురాలి కుమారుడు చరణ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సరికి తల్లి నిర్జీవంగా పడివుంది. దీంతో బాలుడు ఏడుస్తూ వెళ్లి చుట్టుపక్కల వారికి చెప్పాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చౌటుప్పల్ బస్టాండ్ సమీపంలో రమేశ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జయసుధను తానే హత్య చేసినట్లు అతను అంగీకరించడంతో రామన్నపేట కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశం మేరకు రమేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. 

click me!