నల్గొండ జిల్లాలో కారులో రూ. 4 కోట్ల నగదు సీజ్: పోలీసుల దర్యాప్తు

By narsimha lodeFirst Published Oct 20, 2021, 4:36 PM IST
Highlights

ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాలలో కారులో రూ. 4 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో కారులో ఈ నగదును స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.

చిట్యాల: ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాలలో బుధవారం నాడు  ఉదయం carలో రూ.4 కోట్ల నగదును సీజ్ చేశారు.హైదరాబాద్ – విజయవాడ హైవేపై Chityal పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయాడు.ఇది పసిగట్టిన పోలీసులకు కారును పట్టుకొన్నారు.కారును తనిఖీ చేస్తే అందులో  రూ.4 కోట్ల రూపాయల నగదు డబ్బు పట్టుబడింది.

also read:కర్నూల్ జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం: దొంగనోట్లను చించిన యాత్రికులు

కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీఎస్ 10 ఈవై 6160 నెంబర్ గల కియా కారులో హైదరాబాద్ నుంచి చెన్నైకి డబ్బు తీసుకెళ్తుండగా చిట్యాల పోలీసులు చాకచక్యంగా వీరిని పట్టుకున్నారు. కాగా పట్టుబడ్డ డబ్బు హవాలా డబ్బు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ Currencyని ఎవరు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై కూడ దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. ఈ విషయమై అదుపులో ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో  లెక్కచూపని నగదును పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.

click me!