హైదరాబాద్ లో వ్యభిచార గృహంపై దాడి.. అదుపులో నలుగురు...

By SumaBala Bukka  |  First Published May 1, 2023, 9:54 AM IST

హైదరాబాద్ లోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి నలుగురికి అదుపులోకి తీసుకున్నారు. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు.  ఈ దాడిలో ఓ మహిళ, ఓ యువకుడు, ఇద్దరు నిర్వాహకులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. జీడిమెట్ల సీఐ ఏం పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల గాజులరామారంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా వీరికి పక్కా సమాచారం అందింది. దీంతో ఆదివారం నాడు ఆ ఇంటి మీద పోలీసులు దాడి చేశారు. 

కన్నేపల్లి శోభ (47), మందుల లలిత (35) అనే ఇద్దరు మహిళలు  విషయం తెలుసుకుని పోలీసులను అడ్డుకున్నారు. వీరిద్దరూ ఆ వ్యభిచార గృహ నిర్వాహకులు అని తర్వాత పోలీసులు తెలుసుకున్నారు. వీరితోపాటు వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ (23),  గుండ్ల పోచంపల్లికి చెందిన సందీప్ కుమార్ జేనా (27) లను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరందరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరి మీద కేసు నమోదు చేశారు. 23 ఏళ్ల మహిళలను రెస్క్యూ హోంకు పంపించారు. 

Latest Videos

వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో...

ఇదిలా ఉండగా, గతనెలలో ఇలాంటి ఘటనే ఢిల్లీలో వెలుగు చూసింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అకృత్యాల్లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సంచలన ఘటన హృదయాల్ని మెలిపెట్టేలా ఉంది. తల్లిదండ్రులు లేని తన మేనకోడలిని మేనత్త వ్యభిచార కూపంలోకి నెట్టింది.  మైనర్ బాలికను రూ. 55 వేల రూపాయలకు ఓ వ్యక్తికి అమ్మింది. అతను బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు. దీంతో తనను కొన్న వ్యక్తుల నుంచి బాధితురాలు ఎలాగో తప్పించుకొని ఓఎన్జీవోను  ఆశ్రయించింది. 

వారి సహకారంతో  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… 
ఢిల్లీలోని గోవింద్ పురి పోలీస్ స్టేషన్లో బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆమె వాంగ్మూలం ప్రకారం మైనర్ బాలికను కొన్న నిందితుడైన నందుని అరెస్టు చేశారు. అతనికి మేనకోడలు అని కూడా చూడకుండా అమ్మిన అత్త పరారీలో ఉంది. సదరు బాధిత బాలిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. ఎవరూ లేకపోవడంతో ఆ బాలిక మేనత్త దగ్గర ఉంటుంది. సోదరుడి కూతురిని కన్న కూతురులా చూసుకోవాల్సిన ఆమె డబ్బుల కోసం కక్కుర్తి పడింది. నందు అనే పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.55వేలకు ఆ బాలికను అమ్మేసింది.  

అక్కడి నుంచి బాలికను తీసుకువెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లోనే  ఆమెతో వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు. ఈ మేరకు బాలిక తన వాంగ్మూలంలో తెలుపుతూ…‘తన మీద పదిమందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. ఈ క్రమంలోనే గత మంగళవారం కూడా ఓ వ్యక్తి బాలికను వేధించేందుకు రాగా.. అక్కడి నుంచి ఏదోలా తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత  ఓఎన్జీవో  అడ్రస్ సంపాదించి వారిని కలిసింది. వారికి తన బాధను వెల్లడించి సహాయం చేయాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులకు సమాచారం అందించిన ఎన్జీవో సభ్యులు.. నిందితుడైన నందును కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి చికిత్స నిమిత్తం పోలీసు అధికారులు ఆసుపత్రికి తరలించారు. 

బాధితురాలికి వైద్య పరీక్షలు చేసిన వైద్యుల బృందం ఆమె మీద అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించడంతో..  నిందితుల మీద అత్యాచారం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. బాలికను కొని వ్యభిచారంలోకి దింపిన  నిందితుడైన నందును పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాలిక మేనత్త పరారీలో ఉంది.  దీంతో ఆమె మొబైల్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

click me!