వివాహేతర సంబంధం.. ప్రేమ జంట దారుణ హత్య

Published : May 01, 2023, 01:53 AM IST
వివాహేతర సంబంధం.. ప్రేమ జంట దారుణ హత్య

సారాంశం

Extra Marital Affair: అక్ర‌మ సంబంధాల కార‌ణంగా ఇటీవ‌లి కాలంలో నేరాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఈ నేప‌థ్యంలోనే మ‌రో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివాహేత‌ర సంబంధం ప‌ట్టుకున్న ఒక ప్రేమ జంట హ‌త్య‌కు గురైంది. వీరిని అత్యంత కిరాత‌కంగా కొట్టి చంపారు.    

Love Couple Murder At Adilabad: అక్ర‌మ సంబంధాల కార‌ణంగా ఇటీవ‌లి కాలంలో నేరాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌రో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివాహేత‌ర సంబంధం ప‌ట్టుకున్న ఒక ప్రేమ జంట హ‌త్య‌కు గురైంది. వీరిని అత్యంత కిరాత‌కంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘ‌ట‌న తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ హ‌త్య‌ల గురించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు, వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి  ప్రాణాలు తీశారు. గుడిహ‌త్నూర్ లో వెలుగులు చూసిన జంట హ‌త్య‌ల‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. విచార‌ణ ప్రారంభించారు.సీతగోంది గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో ప్రేమ జంట విగతజీవులుగా క‌నిపించ‌డాన్ని స్థానికులు చూసి వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

కేసు న‌మోదు.. విచార‌ణ ప్రారంభం

హ‌త్య‌కు గురైన వారిని ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన మహ్మద్‌ రఫిక్‌, అశ్వినిగా పోలీసులు గుర్తించారు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ జంట హ‌త్య‌లు రెండు-మూడు రోజుల క్రితం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు. కేసు న‌మోదుచేసుకున్నామ‌నీ, దీనిపై లోతైన విచార‌ణ జరుగుతున్న‌ద‌ని తెలిపారు. 

సీసీటీవీలో రికార్డు.. లొంగిపోయిన భర్త.. 

ఈ జంట హ‌త్య‌ల‌కు ముందు ఇద్ద‌రు క‌లిపి స్కూటీ మీద వెళ్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. విచార‌ణ‌లో భాగంగా సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రఫిక్‌  బైక్  నడుపుతుండగా అశ్విని వెనుక కూర్చొని ఉంది. ఆ త‌ర్వాత వీరు దారుణంగా హత్యకు గురయ్యారు. అలాగే, హ‌త్య చేసిన‌వారిని గుర్తించ‌డంలో ప‌లు అధారాలు అభ్య‌మ‌య్యాయి. ఈ హ‌త్య‌ల నేప‌థ్యంలో వారి కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డింది తానేన‌ని అశ్విని భ‌ర్త అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. భార్య వివాహేతర సంబంధం కారణంతో అశ్విని, ఆమె ప్రియుడిని హ‌త్య చేసిన‌ట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం