‘టఫ్’ ను అందుకే సీజ్ చేశాం

First Published Dec 4, 2016, 3:52 PM IST
Highlights
  • విమలక్క కార్యాలయంలో సోదాలపై పోలీసులు

 

తెలంగాణ యునైటడ్ ఫ్రంట్ మావోయిస్టు గ్రూప్ జనశక్తి కి డెన్ గా మారిందని అందుకే ఆ కార్యాలయాన్ని సీజ్ చేశామని డీఐజీ అకున్ సబర్వాల్ తెలిపారు.టఫ్ కార్యాలయం సీజ్ చేయడంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

 

కామారెడ్డి జిల్లాలోని మాచవరంలో భీంభరత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.

 

హైదరాబాద్ దోమలగూడలోని టీయూఎఫ్ కార్యాలయం నుంచి ఆయుధాలు అందుతున్నట్లు భీం భరత్ ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించామన్నారు. జనశక్తి కి అనుబంధగా టీయూఎఫ్ కార్యాలయాన్ని వాడుతున్నట్టు సోదాలలో తేలిందన్నారు.


కూర రాజన్న, అమర్, విమలక్క సూత్రదారులుగా కొత్తగా మరో మావోయిస్టు గ్రూప్ తయారవుతోందని, దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా జరిగినట్లు ఆధారాలున్నాయని అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే దీనిపై కేసులు నమోదు చేస్తామన్నారు. వీరు ముగ్గరు ప్రమేయంపై విచారణ చేస్తున్నామన్నారు.

click me!