ఆ చంద్రడి మనసు ఈ చంద్రుడికి తెలుసట !

Published : Dec 03, 2016, 12:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఆ చంద్రడి మనసు ఈ చంద్రుడికి తెలుసట !

సారాంశం

కేసీఆర్ తో తనకు విభేదాలు లేవన్న చంద్రబాబు

తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న ఇద్దరు చంద్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే  బగ్గుమంటుంది.రెండు రాష్ట్రాల మధ్య గొడవుల కాస్త ఇద్దరు సీఎంల మధ్య గొడవలుగా తయారయ్యాయి.‘ బ్రీఫ్డ్ మీ’ ఎపిసోడ్ తర్వాత ఇంకా విబేధాలు పెరిగాయి.

అదేంటో ఇప్పుడు సడెన్ గా ఏపీ సీఎం చంద్రబాబు స్వరం మార్చారు.

 

తెలంగాణ సీఎం కేసీఆర్ మనసు తనకు బాగా తెలుసని, ఆయనకు తనకు మధ్య విభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. అది కూడా ఢిల్లీలో జరిగిన ఒక కీలక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 

శనివారం దిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన నాయకత్వ సదస్సులో ‘ప్రపంచ నీటి సంక్షోభం- పరిణామాలు’ అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. ఇందులో నూతన రాష్ట్రంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చేపడుతున్న కార్యక్రమాలు వివరించడంతో పాటు కేసీఆర్ గురించి కూడా ప్రస్తావించారు.

 

తన హయాంలోనే హైదరాబాద్‌లో విమానాశ్రయం, సైబర్‌ సిటీలను నిర్మించినట్లు గుర్తు చేశారు. వాటిని చూస్తే ఎప్పుడూ తనకు గర్వంగా ఉంటుందన్నారు.

PREV
click me!

Recommended Stories

Peddi Sudarshan Reddy కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం | KCR | Asianet News Telugu
వందేళ్ల క్రితం అమీర్‌పేట ఎలా ఉండేదో తెలుసా? ఇంత‌కీ ప్రాంతానికి పేరు ఎలా వ‌చ్చిందంటే