
ప్రియాంక రెడ్డి హత్యోదంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అతి కిరాతకంగా ఆమెను హత్య చేసిన వారిని ఉరితీయాలని.. కఠినంగా శక్షించాలని.. వాళ్లు పశువులతో పోల్చడానికి కూడా పనికిరారని చాలా మంది మండిపతున్నారు. అయితే.... మనసమాజంలో ఆ నలుగురు దుండగులు మాత్రమే కాదు... అలాంటి కీచకులు, కిరాతకులు చాలా మంది ఉన్నారని సోషల్ మీడియా చూస్తే అర్థమౌతోంది.
Also Read:ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్
ఆ మృగాళ్ల చేతుల్లో నరకం అనుభవించి ప్రియాంక ప్రాణాలు వదిలితే... కనీసం ఆమె కుటుంబానికి మద్దతుగా నిలవకపోయినా పర్వాలేదు కానీ... ఆమెను కించపరిచేలా కామెంట్స్ చేస్తున్నారు. నిందితులకు మద్దుతగా పోస్టులు పెట్టడం గమానార్హం. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కాబట్టి.. ఆ రేపిస్ట్ లు చాలా లక్కీ అంటూ కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.
Also Read:ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన
సభ్య సమాజం తలవొంచుకునే విధంగా కూడా కొందరు కామెంట్స్ చేశారు. ప్రియాంక ఫోటో పెట్టి ఈ పోస్టులు చేస్తుండటం బాధాకరం.ఆమెపై కిరాతకులు ఏవిధంగా ప్రవర్తించారో వార్తలో చదువుతుంటే కూడా కన్నీళ్లు ఆడడం లేదు. అలాంటిది అంత చెత్తగా ఎలా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడంలేదు.
AlsoRead చంపేశాక కూడా వదల్లేదు... ప్రియాంక రెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు...
కాగా... ఈ చెత్త కామెంట్స్,ట్వీట్స్ కి పోలీసులు స్పందించారు. వెంటనే కొన్ని అసభ్య ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. సైబర్‌క్రైమ్ పోలీ్‌సస్టేషన్ సిబ్బంది ట్విటర్, ఫేస్‌బుక్‌లో నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. శనివారం కొందరిపై కేసులు నమోదు చేయడం గమనార్హం.