బాటసింగారం వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు శంషాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: బాటసింగారం వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసులు గురువారంనాడు ఉదయం శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంపై రోడ్డుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైఠాయించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించాలని బీజేపీ నిర్ణయించింది. బాటసింగారం పోరుబాట కార్యక్రమానికి కమలదళం పిలుపునిచ్చింది. అమెరికా పర్యటనను ముగించుకొని గురువారంనాడు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆయన బాటసింగారం వైపు పయనయమయ్యారు.
Live: https://t.co/mvhuH7EARv
— G Kishan Reddy (@kishanreddybjp)కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు , మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులున్నారు. పార్టీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మార్గంలో బాటసింగారం వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు కిషన్ రెడ్డి కాన్వాయ్ కు అడ్డంగా వాహనాలు పెట్టారు. బాటసింగారం వెళ్లకుండా కిషన్ రెడ్డితో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ పోలీసులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు.
మరోవైపు కిషన్ రెడ్డి కాన్వాయ్ వద్దకు రాచకొండ సీపీ చౌహాన్ వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. బాటసింగారం వెళ్లకుండా పోలీసులు నియంత్రించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు తమను నిలువరించిన చోటే కిషన్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులు బైఠాయించారు.
తన వాహనానికి రోడ్డుకు అడ్డంగా డీసీఎంను పెట్టి నిలువరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఎక్కడికైనా తాను వెళ్లవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాచకొండ సీపీ చౌహాన్ ను ప్రశ్నించారు. చలో బాటసింగారం కార్యక్రమానికి అనుమతివ్వలేదని రాచకొండ సీపీ చౌహాన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెప్పారు. రాచకొండ సీపీ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కిషన్ రెడ్డితో పాటు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించిన కేంద్రమంత్రిని పక్కకు వెళ్లాలని పోలీసులు కోరారు. రోడ్డుపై కూర్చున్న కిషన్ రెడ్డిని కారులో కూర్చోబెట్టారు. ఈ సమయంలో పోలీసులతో కిషన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
కారులో కేంద్ర మంత్రిని కూర్చోబెట్టే సమయంలో పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డోర్ తలకు తాకకుండా జాగ్రత్తగా చూడాలని సీపీ పోలీసులకు సూచించారు. పై నుండి దేవుడు చూస్తున్నాడని కేంద్ర మంత్రి చెప్పారు. తనను చంపేస్తే చంపాలని కిషన్ రెడ్డి పోలీసులతో ఆగ్రహంగా మాట్లడారు. తాను ఏమైనా ఉగ్రవాదినా, టెర్రరిస్టునా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు.
తాను కచ్చితంగా బాటసింగారం వెళ్తానన్నారు. తాను ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి తేల్చి రాచకొండ సీపీకి చెప్పారు. మీ ఆఫీసులోనే ఉంటానన్నారు. సరే సార్.. మీకు చాయి ఇప్పిస్తానని రాచకొండ సీపీ చౌహాన్ చెప్పారు. మీ టీ తాగేందుకు మీ ఆఫీసుకు రావాలా అని ఆయన ప్రశ్నించారు.