హైదరాబాద్ లో దారుణం... భార్యపై బీర్ బాటిల్ తో దాడిచేసిన కసాయి భర్త

By Arun Kumar P  |  First Published Jul 20, 2023, 11:24 AM IST

భార్యపై నడిరోడ్డుపైనే దాడిచేసి అతి దారుణంగా చంపడానికి ప్రయత్నించాడో భర్త. ఈ దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  


హైదరాబాద్ : కట్టుకున్న భార్యను బీర్ బాటిల్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడో కసాయి భర్త. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన మహిళను స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహిళపరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం. ఈ దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాసముండే ఆనంద్, నవీన భార్యాభర్తలు. 2010 లో వీరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలు సంతానం. అయితే ఆటో డ్రైవర్ గా పనిచేసే ఆనంద్ తాగుడుకు బానిసై భార్యాపిల్లల ఆలనాపాలనా మరిచాడు. అంతేకాదు తాగిన మైకంలో భార్య నవీనను చిత్రహింసలకు గురిచేసేవాడు. భర్త వేధింపులు ఇక భరించలేకపోయిన నవీన కొంతకాలంగా దూరంగా వుంటోంది. 

Latest Videos

జూబ్లీహిల్స్ లోనే ఓ హాస్టల్లో వుంటున్న భార్యను బుధవారం ఆనంద్ కలిసాడు. మాట్లాడేది వుందని చెప్పి హాస్టల్ నుండి బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే భార్యను తిరిగి ఇంటికి రావాలని ఆనంద్ కోరగా అందుకామె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.రోడ్డుపైనే భార్యను పట్టుకుని ఆటోలోంచి బీర్ బాటిల్ తీసి కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై నవీన కుప్పకూలిపోగా అలాగే వదిలేసి అక్కడినుండి వెళ్లిపోయాడు. 

Read More  అర్థరాత్రి వృద్ధులైన అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. మృతదేహాలకు నిప్పుపెట్టి, పరార్...

భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన నవీనను స్థానికులు దగ్గర్లోని హాస్పటల్ కు తరలించారు. ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ నవీన పరిస్థితి విషమంగానే వున్నట్లు... ప్రాణాలతో పోరాటం చేస్తున్నట్లు సమాచారం. 

ఈ ఘటననపై సమాచారం అందుకున్న పోలీసులు నవీన భర్త ఆనంద్ కోసం గాలిస్తున్నారు. భార్యపై దాడిచేసిన అతడిపై హత్యాయత్నం  సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసారు. అతడిని కఠినంగా శిక్షించాలని నవీన తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. 
 

click me!