కిడారి హత్య: ఇద్దరు తెలంగాణ నేతలకు పోలీసుల నోటీసులు

By sivanagaprasad KodatiFirst Published Sep 28, 2018, 1:35 PM IST
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. మావోల కదలికలు మళ్లీ ఎక్కువవ్వడంతో.. ఏపీ-తెలంగాణ, ఏపీ-ఒడిషా, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జయశంకర్ భూపాల పల్లి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు..

ముందస్తు ఎన్నికల దృష్ట్యా అటవీ గ్రామాల్లో పర్యటనలకు వెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ మాజీ మంత్రి శ్రీధర్ బాబు, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో నేతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య ఎఫెక్ట్.. గిడ్డి ఈశ్వరికి భద్రత పెంపు

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

click me!