అత్తాపూర్ మర్డర్‌లో ట్విస్ట్: సంచలన విషయాన్ని బయటపెట్టిన సోదరుడు

Published : Sep 28, 2018, 12:55 PM IST
అత్తాపూర్ మర్డర్‌లో ట్విస్ట్: సంచలన విషయాన్ని బయటపెట్టిన సోదరుడు

సారాంశం

నెలరోజుల ముందే  రమేష్‌ను హత్య చేస్తామని మహేష్‌గౌడ్  తండ్రి కిషన్‌గౌడ్ తమను హెచ్చరించినట్టు రమేష్  సోదరుడు నర్సింహ చెప్పారు


హైదరాబాద్: నెలరోజుల ముందే  రమేష్‌ను హత్య చేస్తామని మహేష్‌గౌడ్  తండ్రి కిషన్‌గౌడ్ తమను హెచ్చరించినట్టు రమేష్  సోదరుడు నర్సింహ చెప్పారు.  మహేష్‌గౌడ్‌ను నా సోదరుడు చంపిన తర్వాత కిషన్‌గౌడ్ నుండి తమకు ప్రాణభయం ఉందని పటాన్‌చెర్వులో ఉంటున్నట్టు నర్సింహ చెప్పాడు.

మూడు రోజుల క్రితం అత్తాపూర్‌లోని పిల్లర్ నెంబర్ 143 వద్ద కిషన్‌గౌడ్ అనే వ్యక్తి మరో ముగ్గురి సహాయంతో  రమేష్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా  నరికి చంపాడు.  2017 డిసెంబర్ 24 వ తేదీన తన కొడుకు మహేష్‌గౌడ్‌ను  రమేష్ అతని స్నేహితులు కలిసి  చంపేశారు.

ఈ హత్యకు ప్రతీకారంగానే  మహేష్ గౌడ్ తండ్రి కిషన్ గౌడ్ రమేష్ ను పట్టపగలే  హత్య చేశాడు. రమేష్ మృతదేహనికి పోస్టుమార్టం పూర్తి చేసి నర్సింహకు అప్పగించారు.  పురానాపూల్ స్మశానవాటికలో  గురువారం రాత్రి అంత్యక్రియలను నిర్వహించారు.

మహేష్‌గౌడ్‌ను హత్య చేసిన తర్వాత తమ ఇంటిని కూడ కిషన్‌గౌడ్‌కే ఇచ్చేసి తాము పటాన్‌ చెర్వుకు వెళ్లిపోయినట్టు నర్సింహ చెప్పారు. అంతేకాదు  రమేష్‌ను హత్య చేసినందుకు కిషన్‌గౌడ్‌తో ఇతరులపై తాము కేసు పెట్టబోమని ఆయన చెప్పారు. 

కోర్టుకు హాజరయ్యే ఒక్క రోజు ముందు తన సోదరుడు రమేష్ తనకు ఫోన్ చేసి కోర్టు వాయిదాకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతోందని చెబితే తానే బంధువులకు చెందిన ఓ వాహనాన్ని సమకూర్చినట్టు  నర్సింహ చెప్పాడు. 

నెల రోజుల క్రితమే పటాన్‌చెర్వులో ఉంటున్న తమ ఇంటికి వచ్చిన కిషన్‌గౌడ్ రమేష్ అడ్రస్ చెప్పాలని  అడిగారని  నర్సింహ కొడుకు చెప్పాడు.  అడ్రస్ చెప్పాలని బెదిరించినట్టు తెలిపారు. అయితే  రమేష్ అడ్రస్ తమకు తెలియదని నర్సింహ కొడుకులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అత్తాపూర్ మర్డర్: రమేష్‌ను కాపాడేందుకు ముగ్గురి సాహసం

అత్తాపూర్ మర్డర్: 'కొడుకా.. నీ వద్దకే రమేష్‌ను పంపా'

10 నెలల క్రితం కొడుకు హత్య: అత్తాపూర్ మర్డర్ వెనుక కారణమిదే(వీడియో)

అత్తాపూర్‌ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...

 

 

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu