కాంగ్రెస్ రేవంత్ కు షాక్ ఇచ్చిన టిడిపి రమణ

First Published Nov 10, 2017, 12:07 PM IST
Highlights
  • బాబు దగ్గర రేవంత్ రాజీనామా లేఖ లేదు
  • రేవంత్ స్థాయి నాయకుడి నుంచి కార్యకర్త కు పడిపోయింది
  • కొడంగల్ లో సభ పెట్టి సత్తా చాటుతాం
  • టిడిపి కేడర్ ఇప్పటికీ బలంగానే ఉంది

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారా? చేస్తే ఆ రాజీనామా కాయితం ఎవలికిచ్చిండు? ఇప్పుడు ఆ కాయితం ఎవలికాడ ఉంది? ఈ అంశాలు ఇప్పుడు తెలంగాణ, ఎపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయినయి. అయితే రేవంత్ రెడ్డి రాజీనామాపై టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ షాకింగ్ న్యూస్ చెప్పారు. దీంతో రేవంత్ రాజీనామాపై కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి టిడిపి రమణ ఇచ్చిన ఫస్ట్ షాక్ ఇదే కావడం గమనార్హం. 

రేవంత్ రెడ్డి అమరావతికి పోయి టిడిపికి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఆయన టిడిపి ప్రాథమి సభ్యత్వానికి రాజీనామా చేసి చంద్రబాబు పేషీలో అందించిండు. దాంతోపాటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన లేఖను కూడా బాబు పేషీలోనే అందజేసిండు. ఈ విషయాన్ని రేవంత్ కూడా చెప్పిండు. కానీ ఇప్పుడు టిడిపి తెలంగాణ అధ్యక్షలు ఎల్.రమణ వేరే ముచ్చట చెబుతున్నారు.

ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా కాయితాన్ని చంద్రబాబుకు అందజేశానని రేవంత్ చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని రమణ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా నే చేయలేదన్నారు రమణ. పార్టీ మారిన తర్వాత రేవంత్ స్థాయి నాయకుడి నుంచి కార్యకర్తకు పడిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తెలుగుదేశమే అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టిడిపి నుంచి నాయకులు మాత్రమే పార్టీ మారారు తప్ప పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదని రమణ ధీమా వ్యక్తం చేశారు.

త్వరలో కొడంగల్ లో సభ ఏర్పాటు చేసి టిడిపి సత్తా చాటుతామన్నారు. ఎర్ర శేఖర్ ఆధ్వర్యంలో పాలమూరులో పార్టీ బలంగా ఉందన్నారు. ఇప్పటి వరకు రేవంత్ చాలా పార్టీలు మారారు కానీ ఆయన వెళ్లినప్పుడల్లా ఆయా పార్టీలు బలహీన పడ్డాయా? అని ప్రశ్నించారు. మాకున్న ఒప్పందం ప్రకారం నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందన్నారు రమణ. తెలంగాణలో నియోజకవర్గాలు పెరిగితే ప్రజలకు లాభం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు బాబు దగ్గర రాజీనామా లేఖ ఉందని చెబుతున్న రేవంత్ కు రమణ గట్టి షాకే ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మరి రేవంత్ దీనిపై ఏరకంగా స్పందిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ రేవంత్ మరోమారు తన రాజీనామాను స్పీకర్ కు అందిస్తారా? లేక బాబు దగ్గరే ఉందని చెబుతారా అన్నది చూడాలి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్వాగత్ హోటల్ లో పురుగల చికెన్

ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్
https://goo.gl/Tsck2C

click me!