సైదాబాద్ ఘటనను నిరసిస్తూ వైఎస్ షర్మిల దీక్ష.. భగ్నం చేసిన పోలీసులు..!

Published : Sep 16, 2021, 08:19 AM ISTUpdated : Sep 16, 2021, 10:11 AM IST
సైదాబాద్ ఘటనను నిరసిస్తూ వైఎస్ షర్మిల దీక్ష.. భగ్నం చేసిన పోలీసులు..!

సారాంశం

నగరంలోని సైదాబాద్ పరిధి సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

సైదాబాద్ లో ఇటీవల ఆరేళ్ల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి  చంపేసిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారిని అత్యంత క్రూరంగా చంపేసిన కిరాతకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనను నిరసిస్తూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

నగరంలోని సైదాబాద్ పరిధి సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. షర్మిల బుధవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై తెలంగాణ సీఎం స్పందించే వరకు కదిలేది లేదని అక్కడే దీక్షకు కూర్చున్నారు.

దీంతో బుధవారం అర్థరాత్రి దాటాక పోలీసులు రంగ ప్రవేశం చేసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులను చెదరగొట్టి షర్మిల దీక్షను భగ్నం చేశారు. అనంతరం దీక్షాస్థలి నుంచి షర్మిలను తరలించారు. మరో వైపు నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!