తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 280 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,325 యాక్టివ్ కేసులు వున్నాయి.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,62,526కి చేరుకుంది.
ఇప్పటి వరకు 6,53,302 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 3,899 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని, మరణాల రేటు 0.58 శాతంగా ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,325 యాక్టివ్ కేసులు ఉన్నాయి
undefined
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 79, జగిత్యాల 11, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 22, ఖమ్మం 24, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 7, మంచిర్యాల 8, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 15, ములుగు 0, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 19, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 3 , పెద్దపల్లి 12, సిరిసిల్ల 11, రంగారెడ్డి 18, సిద్దిపేట 8, సంగారెడ్డి 6, సూర్యాపేట 7, వికారాబాద్ 4, వనపర్తి 4, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 12, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.
Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.15.09.2021 at 5.30pm) pic.twitter.com/g0Up8rIofE