సైదాబాద్ హత్యాచారం కేసు.. రాజు కోసం వేట, మద్యం దుకాణాలు, కల్లు కాంపాండ్‌‌లే టార్గెట్: డీజీపీ

By Siva KodatiFirst Published Sep 15, 2021, 9:30 PM IST
Highlights

సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నానాటికీ జఠిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీలతో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్ల వద్ద నిరంతరం నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. 
 

జిల్లా ఎస్పీలతో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పోలీస్ స్టేషన్‌లలోని అధికారులు అప్రమత్తంగా వుండాలని డీజీపీ ఆదేశించారు. నిందితుడు రాజు ఫోటోలతో స్థానికంగా గాలింపు చర్యలు చేపట్టాలని మహేందర్ రెడ్డి సూచించారు. చిన్న సమాచారాన్ని కూడా వదిలిపెట్టకుండా వెరిఫై చేయాలని ఆయన ఆదేశించారు. మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్ల వద్ద నిరంతరం నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. 

కాగా, సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నానాటికీ జఠిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సీపీలతో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమావేశమయ్యారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఘటన విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా వున్నారని ఆయన తెలిపారు.

Also Read:న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: సైదాబాద్ బాలిక ఫ్యామిలీకి పవన్ పరామర్శా

నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులును ఆదేశించారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో కేసును విచారణ చేయాలని మహమూద్ అలీ ఆదేశించారు. చిన్నారిపై హత్యాచార ఘటన విషయంలో కేసీఆర్ బాధపడ్డారని.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని హోంమంత్రి తెలిపారు. 

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా వుంచుతామని ఆయన స్పష్టం చేశారు. రాజు గురించిన వివరాలు తెలిస్తే.. 949061366, 9490616627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

click me!