కారు దగ్ధం.. డిక్కీలో శవం: హత్య వెనుక వివాహేతర సంబంధం, మృతుని భార్య సంచలనం

Siva Kodati |  
Published : Aug 10, 2021, 10:26 PM ISTUpdated : Aug 10, 2021, 10:27 PM IST
కారు దగ్ధం.. డిక్కీలో శవం: హత్య వెనుక వివాహేతర సంబంధం, మృతుని భార్య సంచలనం

సారాంశం

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో హత్యకు గురైన వ్యక్తిని ధర్మకారి శ్రీనివాస్‌గా గుర్తించారు. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనతో తరచూ గొడవ పడేవాడని హైందవి పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో హత్యకు గురైన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. కారు ఇంజిన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్‌ పట్టణంలోని ఓ సినిమా టాకీస్‌ యజమాని వాహనంగా దాన్ని గుర్తించారు. మృతుడిని మెదక్‌కు చెందిన ధర్మకారి శ్రీనివాస్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో. మృతుడి నోటిలో ఉన్న కృత్రిమ దంతాల ఆధారంగా శ్రీనివాస్‌ను ఆయన భార్య హైందవి గుర్తించారు. అనంతరం భర్త హత్యపై ఆమె వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనతో తరచూ గొడవ పడేవాడని హైందవి పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

ALso Read:మెదక్ జిల్లాలో దగ్దమైన కారు: డిక్కీలో డెడ్‌బాడీ
 

PREV
click me!

Recommended Stories

పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్
KCR Grandson Himanshu : కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా?