తెలంగాణ: 24 గంటల్లో 494 మందికి పాజిటివ్.. 6,50,353కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Aug 10, 2021, 09:52 PM IST
తెలంగాణ: 24 గంటల్లో 494 మందికి పాజిటివ్.. 6,50,353కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 494 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. 621 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,112 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 89,037 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 494 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,831కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 621 మంది కోలుకోవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,38,410కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 8,112 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 14, జీహెచ్ఎంసీ 80, జగిత్యాల 21, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 3, కామారెడ్డి 5, కరీంనగర్ 51, ఖమ్మం 29, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 6, మంచిర్యాల 12, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 26, ములుగు 5, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 33, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 7, పెద్దపల్లి 28, సిరిసిల్ల 14, రంగారెడ్డి 23, సిద్దిపేట 13, సంగారెడ్డి 5, సూర్యాపేట 18, వికారాబాద్ 3, వనపర్తి 2, వరంగల్ రూరల్ 13, వరంగల్ అర్బన్ 45, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu
CSK vs SRH : హైదరాబాద్ లో భారీ వర్షం... ఐపిఎల్ మ్యాచ్ అనుమానమేనా..?