వెంకటాపూర్ కారు దగ్దం కేసులో ట్విస్ట్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ డ్రామా

By narsimha lode  |  First Published Jan 17, 2023, 11:09 AM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలోని  టెక్మాల్ లోని  వెంకటాపూర్  శివారులో కారు దగ్దమైన కేసులో  ట్విస్ట్  నెలకొంది.  కారు దగ్దమైన కేసులో  మృతి చెందింది  ధర్మానాయక్ కాదని  పోలీసులు గుర్తించారు. 


హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని   వెంకటాపూర్  వద్ద  కారు దగ్దం కేసులో  ట్విస్ట్  చోటు చేసుకుంది. కారు దగ్దం కేసులో  మృతి చెందింది సచివాలయ ఉద్యోగి ధర్మా కాదని పోలీసులు గుర్తించారు.  మహరాష్ట్రలోని పుణెలో  ఉన్న ధర్మాను పోలీసులు మంగళవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నెల 9వ తేదీన  మెదక్ జిల్లాలోని  టెక్మాల్ మండలం  వెంకటాపూర్ సమీపంలో  కారులో  కాలిన డెడ్  బాడీ  లభ్యమైంది.  ప్రమాదవశాత్తు  ఈ ఘటన జరిగిందా లేదా  ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు  నిర్వహించారు.  ప్రమాదానికి సమీపంలో  బాటిల్ లో పెట్రోల్ డబ్బా లభ్యమైంది.  దీంతో  ఈ కేసును  పోలీసులు  సవాల్ గా తీసుకుని విచారణ నిర్వహించారు. పోలీసుల దర్యాప్తులో  కీలక విషయాలు వెలుగు చూశాయి. 

Latest Videos

ఆన్ లైన్ గేమింగ్ , బెట్టింగ్ లో  సెక్రటేరియట్ ఉద్యోగి  ధర్మానాయక్  రూ. 2 కోట్లు అప్పులు చేశాడు.  దీంతో  తాను చనిపోయినట్టు డ్రామా ఆడితే  రూ.  ఇన్సూరెన్స్ డబ్బులు  రూ. 7 కోట్లు వస్తాయి. దీంతో  అప్పులు తీర్చవచ్చని ధర్మానాయక్  భావించారు.   ఈ నెల  9వ తేదీన  కారు దగ్దం కేసులో  ధర్మానాయక్ చనిపోయినట్టుగా డ్రామా ఆడారు.ఈ నెల  5వ తేదీన  హైద్రాబాద్ నుండి కుటుంబంతో కలిసి  ఉమ్మడి మెదక్ జిల్లాలోని  తన స్వగ్రామానికి  వెళ్లాడు.  కుటుంబసభ్యులను  ఇంట్లో వదిలిపెట్టాడు.  విధులకు  వెళ్లిపోతున్నట్టుగా  ఇంట్లో చెప్పిన ధర్మానాయక్  కారు  దగ్దమైన స్థితిలో  గుర్తించారు.

ఉమ్మడి  మెదక్ జిల్లాలోని  బీమ్లాతండాకు  చెందిన  ధర్మానాయక్  కారు దగ్దం  కేసును పోలీసులు  లోతుగా దర్యాప్తు  చేశారు.  ప్రమాదం జరిగిన  స్థలం  వద్ద  పెట్రోల్ బాటిల్  లభ్యమైంది. పెట్రోల్  బాటిల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు  నిర్వహించారు.ఈ దర్యాప్తులో  పోలీసులు కీలక సమాచారం సేకరించారు. 

ధర్మానాయక్  కారులో లభించిన  మృతదేహం ఎవరిదనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. మూడు రోజుల క్రితం  ధర్మానాయక్ తన భార్యకు  ఫోన్ చేసినట్టుగా  ప్రచారం సాగుతుంది.  డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీలో అందజేయాలని కోరినట్టుగా  చెబుతున్నారు.  ఈ విషయమై  సమాచారం ఆధారంగా  పోలీసులు దర్యాప్తు  నిర్వహిస్తే  ధర్మానాయక్  పుణెలో  ఉన్నట్టుగా  తేలింది. మంగళవారంనాడు ధర్మానాయక్ ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

also read:మెదక్ లో కారులో కాలిన మృతదేహం: మృతుడు ధర్మాగా గుర్తింపు

కారులో  లభ్యమైన మృతదేహనికి  ధర్మానాయక్  కుటుంబసభ్యులు  అంత్యక్రియలు నిర్వహించారు.  ధర్మానాయక్  కారులో  లభ్యమైన  మృతదేహం ఎవరిదనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం  ధర్మానాయక్  చనిపోయినట్టుగా ఆడిన డ్రామా కుటుంబసభ్యులకు తెలిసి చేశాడా లేదా అనే విషయమై  కూడా  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.   కారు దగ్దమైన ఘటన వెలుగు చూసిన రోజున  కారులో ఉన్న మృతదేహం  ధర్మానాయక్ దేనని  చెప్పిన వారిని కూడా  పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


 

click me!