మూసీలో కొట్టుకుపోయిన జహంగీర్ డెడ్‌బాడీ లభ్యం: కొర్రెముల వద్ద మృతదేహం గుర్తింపు

By narsimha lodeFirst Published Oct 4, 2021, 5:45 PM IST
Highlights

మూసీ నదిలో నాలుగు రోజుల క్రితం కొట్టుకుపోయిన జహంగీర్ మృతదేహన్ని సోమవారం నాడు ఘట్‌కేసర్ మండలం కొర్రెముల చెరువు వద్ద గుర్తించారు.  జహంగీర్ మూసీలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లి మూసీలో కొట్టుకుపోయాడు.

హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం మూసీ (musi river)నదిలో కొట్టుకుపోయిన జహంగీర్   (jahangir dead body)మృతదేహన్ని సోమవారం నాడు గుర్తించారు.  ఘట్‌కేసర్ (ghatkesar) మండలం కొర్రెముల (korremula) చెరువు వద్ద జహంగీర్ మృతదేహం ఇవాళ లభ్యమైంది.

also read:Cyclone gulab:మూసీ నదిలో కొట్టుకుపోయిన మృతదేహం

గులాబ్ తుఫాన్(cyclone gulab) కారణంగా తెలంగాణ (telangana)రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. మూసీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో మూసీకి వరద పోటెత్తింది. వారం రోజుల క్రితం మూసీ నదిలో ఓ మృతదేహన్ని తొలుత స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ మృతదేహన్ని పట్టుకొనేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించారు. కానీ మూసీలో వరద ప్రవాహం కారణంగా సాధ్యం కాలేదు.

జహంగీర్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాడు ఘట్‌కేసర్ మండలం కొర్రేముల వద్ద జహంగీర్ డెడ్‌బాడీ లభ్యమైంది.చాదర్‌ఘాట్ లోని( chaderghat) శంకర్ నగర్ కు చెందిన జహంగీర్ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు.ఈ నెల 1వ తేదీన జహంగీర్ మూసీ కాలువ వద్దకు కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ముసీలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన జరిగిన సమయంలో  జహంగీర్ కొడుకు కూడ అక్కడే ఉన్నాడు. 

స్థానికులు జహంగీర్ ను కాపాడే ప్రయత్నం చేసినా కూడ సాధ్యం కాలేదు. 2011 లో జహంగీర్ తండ్రి కూడ మూసీలో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో భారీ వర్షాలు కురిశాయి. మూసీలో చెత్త వేసేందుకు వెళ్లిన జహంగీర్ తండ్రి మూసీలో పడి కొట్టుకుపోయాడు.

click me!