కాంగ్రెస్ హయంలో కంటే ఎక్కువ నిధులు: పాతబస్తీ అభివృద్దిపై అసెంబ్లీలో కేటీఆర్

By narsimha lodeFirst Published Oct 4, 2021, 5:20 PM IST
Highlights


పాతబస్తీ అభివృద్ది కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని  మంత్రి కేటీఆర్ చెప్పారు. సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో (telangana Assembly)  పాతబస్తీ అభివృద్దిపై  సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.


హైదరాబాద్:పాతబస్తీ (old city) అభివృద్ది కోసం తమ ప్రభుత్వం రూ. 14 వేల 887 కోట్లు ఖర్చు చేసినట్టుగా మంత్రి కేటీఆర్  (ktr)చెప్పారు. సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో (telangana Assembly)  పాతబస్తీ అభివృద్దిపై  సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

also read:మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి: తెలంగాణ అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క

అధికార, విపక్ష సభ్యులు అనే వివక్ష లేకుండానే కేసీఆర్(kcr) అభివృద్ది చేస్తున్నారని మంత్రి తెలిపారు. 2004 నుండి 2014 మధ్య కాంగ్రెస్ (congress) ప్రభుత్వం  పాతబస్తీ అభివృద్ది కోసం ఖర్చు చేసింది  రూ.3934 కోట్లు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.

పాతబస్తీలో రూ.1540 కోట్ల ఖర్చుతో ఎస్ఆర్‌డీపీ (srdp)కింద రోడ్లు అభివృద్ది చేస్తున్నామన్నారు. సీఆర్ఎంపీ (crmp)కింద రూ. 118 కోట్ల ఖర్చుతో రోడ్లు నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. 

పాతబస్తీ, కొత్త నగరం అనే తేడా లేకుండా  హైద్రాబాద్ ను అభివృద్ది చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాతబస్తీలో 44 ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ది చేస్తున్నామని మంత్రి  చెప్పారు.అన్నపూర్ణ పథకం ద్వారా పాతబస్తీలో 2 కోట్ల మందికి భోజనం పెట్టామన్నారు.
 

click me!