మెదక్ జిల్లాలో దగ్దమైన కారు: డిక్కీలో డెడ్‌బాడీ

By narsimha lode  |  First Published Aug 10, 2021, 11:35 AM IST

ఉమ్మడి మెదక్ జిల్లా వెల్ధుర్తి మండలం మంగళపర్తిలో  ఓ కారు దగ్ధమైంది. ఈ కారులో డెడ్‌బాడీ లభ్యమైంది.ఈ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది.ఈ కారు ప్రమాదవశాత్తు తగులబడిందా లేదా ఎవరైనా  తగులబెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు


మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా వెల్ధుర్తి మండలం మంగళపర్తిలో దారుణం చోటు చేసుకొంది. హోండా సిటీ కారు దగ్దమైంది., ఈ కారు డిక్కీలో గుర్తు తెలియని మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఈ డెడ్‌బాడీ పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. కారు ఎలా కాలిపోయింది, కారులోని డెడ్‌బాడీ ఎవరిదనే విషయమై అంతుబట్టకుండా ఉంది.

&n

మెదక్ జిల్లా వెల్ధుర్తి మండలం మంగళపర్తిలో దారుణం చోటు చేసుకొంది. హోండా సిటీ కారు దగ్దమైంది., ఈ కారు డిక్కీలో గుర్తు తెలియని మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఈ డెడ్‌బాడీ పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. కారు ఎలా కాలిపోయింది, కారులోని డెడ్‌బాడీ ఎవరిదనే విషయమై అంతుబట్టకుండా ఉంది. pic.twitter.com/NpLOQrhGCz

— Asianetnews Telugu (@AsianetNewsTL)

Latest Videos

bsp;

 

కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన రియల్‌ఏస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్‌కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. టీఎస్ 15 ఈహెచ్ 4005 నెంబర్ గల కారును మంగళవారం నాడు తెల్లవారుజామున రోడ్డుపైనే దగ్ధమైంది.శ్రీనివాస్ నిన్న స్వగ్రామం నుండి హైద్రాబాద్ కు వచ్చాడు.  హైద్రాబాద్ నుండి తిరిగి వెళ్తున్నట్టుగా  టోల్‌గేట్ సమీపంలో సీపీటీవీ పుటేజీని పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్  ఫోన్ కూడ స్విచ్ఛాప్ అయినట్టుగా పోలీసులు  తెలిపారు. కారులో డెడ్‌బాడీ ఎవరిదనే విషయమై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. 
 

click me!