హైదరాబాద్ లో కారు డీలర్ భారీ మోసాలు.. గోవాలో ఎంజాయ్ చేస్తూ..

By telugu news teamFirst Published Aug 10, 2021, 8:26 AM IST
Highlights

బ్యాంకర్లు చెక్కులు ఇవ్వగానే తన వాటా తీసుకునేవాడు. ఇతర నిందితులతో కలిసి రూ.1.90కోట్లు కాజేశాడు. రుణం వసూలు కాకపోవడంతో కెనరా బ్యాంక్, ఐడీబీఐ అధికారులు క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్ లో భారీ మోసాలకు పాల్పడిన ఓ కారు డీలర్.. తాజాగా గోవాలో ఎంజాయ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు.  కార్లు కొనేందుకు బ్యాంకుల్లో రుణాలు తీసుకొనే వారికి నకిలీ టీఆర్( టెంపరరీ రిజిస్ట్రేషన్) నెంబర్లు , ఛాసిస్ నంబర్లు ఇచ్చి.. రూ.లక్షలు దండుకొని కనిపించకుండా పోయిన తల్వాల్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సాకేత్ తల్వార్(41) ను సెంట్రల్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను గత మూడేళ్లుగా ఈ దందా చేస్తుండటం గమనార్హం.

నగరంలో తల్వార్ కార్స్ పేరుతో వోల్వో, హ్యుందాయ్ కార్ల కంపెనీల డీలర్ షిప్ లను సాకేత్ తల్వార్ కొన్నేళ్ల క్రితం తీసుకున్నాడు. నాలుగు చోట్ల షోరూంలను ప్రారంభించాడు. కొత్త కార్లను వేగంగా మార్కెట్ లోకి తీసుకువచ్చి అంతే వేగంగా విక్రయించేవాడు. మూడేళ్ల క్రితం వాహనాల రుణం కోసం వచ్చిన వారితో కలిసి కుమ్మకయ్యాడు.

వారితో కలిసి .. విక్రయించకుండానే నకిలీ పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. బ్యాంకర్లు చెక్కులు ఇవ్వగానే తన వాటా తీసుకునేవాడు. ఇతర నిందితులతో కలిసి రూ.1.90కోట్లు కాజేశాడు. రుణం వసూలు కాకపోవడంతో కెనరా బ్యాంక్, ఐడీబీఐ అధికారులు క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో.. సాకేత్ పై పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్ పోలీస్ స్టేషన్ లలోనూ ఆరు కేసులు నమోదయ్యాయి. నకిలీ టీర్ పత్రాలు ఇస్తున్నాడంటూ రవాణ శాఖ పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది.

తనపై కేసులు ఎక్కువగా పెరగడంతో... కుటుంబంతో కలిసి గోవాకు పరారయ్యాడు. అక్కడ నెలకు రూ.12లక్షలు చెల్లించి ఓ విల్లాలో విలాసంగా గడుపుతుండటం గమనార్హం. రోజంతా విందులు, వినోదాలతో సరదాగా గడుపుతున్నాడు. నగరంలో ఉండే తన  దూరపు బంధువకు ఇటీవల ఫోన్ చేశాడు. ఆ ఫోన్ పై నిఘా పెట్టిన పోలీసులు... నిందితుడి ఆచూకీ గుర్తించారు. గోవాలో నిందితుడిని అరెస్టు చేశారు.

click me!