ప్రియుడి మోసం, బాలిక ఆత్మహత్య.. పోస్టుమార్టంలో ఏంతేలిందంటే...

By telugu teamFirst Published Jan 31, 2020, 10:09 AM IST
Highlights

అతను ప్రేమ నిజమనుకొని తన సర్వం అర్పించుకుంది. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అతనికి చెప్పి పెళ్లి చేసుకోమని అడిగితే కాదన్నాడు. దీంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించి గతేడాది సెప్టెంబర్ 3 వ తేదీన ఆత్మహత్యాయత్నం  చేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ అదే నెల 7వ తేదీన మృతి చెందింది. కడుపునొప్పి భరించలేక చనిపోయిందని కుటుంబసభ్యులు పోలీసులకు తెలియజేశారు.

ఓ మైనర్ బాలిక ప్రేమలో మోసపోయింది. ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మింది. అతనికి తన సర్వం అర్పించుకుంది. ఆ తర్వాత తాను గర్భం దాల్చినట్లు బాలిక తెలుసుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. 

పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడింది. అతను నిరాకరించి కాదు పొమ్మన్నాడు. దీంతో... చేసేదిలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయాక పోస్టుమార్టంలో తేలిన విషయాలు కుటుంబసభ్యులను సైతం విస్మయానికి గురిచేశాయి. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మిడ్జిల్ మండల పరిధిలోని ఓ తండాకు చెందిన బాలిక(15)కి రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా... ఆ బాలుడు దూరవిద్య ద్వారా ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

Also Read అక్రమ అరెస్ట్‌: ఎస్‌ఐకు నెల జైలు శిక్ష విధించిన కోర్టు...

అతను ప్రేమ నిజమనుకొని తన సర్వం అర్పించుకుంది. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అతనికి చెప్పి పెళ్లి చేసుకోమని అడిగితే కాదన్నాడు. దీంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించి గతేడాది సెప్టెంబర్ 3 వ తేదీన ఆత్మహత్యాయత్నం  చేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ అదే నెల 7వ తేదీన మృతి చెందింది. కడుపునొప్పి భరించలేక చనిపోయిందని కుటుంబసభ్యులు పోలీసులకు తెలియజేశారు.

అయితే... పోస్టుమార్టంలో బాలిక ఆరునెలల గర్భిణి అని తేలడంతో అందరూ షాకయ్యారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో బాలిక స్నేహితులను విచారించారు. దీనిలో భాగంగా బాలిక సెల్ ఫోన్ పోలీసులకు దొరికింది. ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

బాలిక ఆత్మహత్య తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ ఆరుగురు చెప్పడంతో.. న్యాయస్థానం అనుమతితో వారి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. ఆ ఆరుగురిలో ఓ బాలుడి డీఎన్ఏ బాలిక కడుపులో పిండంతో సరిపోయింది. రుజువుతో సహా పోలీసులకు దొరికిపోవడంతో.. నిజం అంగీకరించాడు.  నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
 
click me!