కరోనా వైరస్ ఎఫెక్ట్: గాంధీలో ఒకరికి పరీక్షలు, భయం ఇదీ....

By narsimha lode  |  First Published Jan 31, 2020, 8:28 AM IST

కరోనా వైరస్ అనుమానంతో గాంధీ ఆసుపత్రిలో ఓ వ్యక్తి చేరాడు. 


హైదరాబాద్: చైనా నుండి నగరానికి వచ్చిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.దేశంలోని కేరళలో ఇప్పటికే కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది.

త్రిపురలో ఒకరు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు చైనాలో ఉన్నారు.  వారిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు.

Latest Videos

also read:కరోనా వైరస్: చైనాలోనే తెలుగు టెక్కీలు, ఆందోళనలో కుటుంబాలు

కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే వైరస్‌ సోకిందనే అనుమానంతో ఇప్పటికే పలువురు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

హైద్రాబాద్ మియాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్‌ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే అతను చైనా నుంచి నగరానికి వచ్చారు. అయితే ప్రస్తుతం గాంధీలో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

కరోనా నిర్ధారణ పరీక్షలు కోసం ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అలాగే చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేకంగా థర్మల్‌ స్కానింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

 సముద్రతీరం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తీరం వెంబడి ఉన్న రేవు పట్టణాల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన విద్యార్థిని చైనాలో మెడిసిన్‌ చేస్తూఇటీవలే తిరిగి వచ్చింది. 

ఆమెకు అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో  నెగిటివ్‌ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.చదువుల కోసం చైనా వెళ్లి చిక్కుబడిన వారికోసం వాళ్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

వూహన్ యూనివర్శిటీలో మెడిసిన్ కోసం ఎక్కువగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే కొందరు విద్యార్థులు ఇండియాకు తిరిగి వచ్చారు. మరికొందరు విద్యార్థులు అక్కడే చిక్కుకొన్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. మరోవైపు వుహాన్ లో ట్రైనింగ్ కోసం 58 మంది తెలుగు టెక్కీలు చిక్కుకొన్నారు.

తెలుగు టెక్కీలను రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు.మరో వైపు టెక్కీల కుటుంబసభ్యులు కూడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు.
 

click me!