నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది.
నాగర్ కర్నూల్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి,సంపత్ కుమార్ లపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ పట్వారి ఫిర్యాదుతో కేసు నమోదైంది.గోవర్ధన్ పట్వారి ఫిర్యాదు మేరకు ఐసీసీ 153, 504 సెక్షన్ల కింద సెక్షన్లలో కేసు నమోదు చేశారు.
నిన్న నాగర్ కర్నూల్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు ముఖ్యంగా పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి వత్తాసు పలికిన పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన అధికారుల జాబితాను సిద్దం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.ఈ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డిపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ పట్వారి నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.