టీఆర్ఎస్ మంత్రి చందూలాల్‌, తనయుడు ప్రహ్లాద్‌లపై కేసు నమోదు

By Arun Kumar PFirst Published Oct 24, 2018, 3:12 PM IST
Highlights

ములుగు నియోజకవర్గ టీఆర్ఎస్‌‌ పార్టీలో అలజడి కొనసాగుతోంది. గత సోమవారం మంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న టీఆర్ఎస్ నాయకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తన తండ్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కోపంతో చందులాల్‌ కుమారుడు ప్రహ్లాద్‌ తన అనుచరులతో కలిసి అసమ్మతి నేతల వాహానాలను ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. 

ఈ గొడవ ఇపుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. మంత్రి చందూలాల్ తో పాటు ఆయన తనయుడు, స్థానిక మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రహ్లాద్ లు కలిసి తమపై దాడి చేయించారని అసమ్మతి నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో మంత్రి, అతడి తనయుడితో పాటు రామప్ప మండలానికి చెందిన నాయకులపై పోలీసులు ఎస్సీ,  ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు 143, 147, 341, 506, 149, 427, 109 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.       

నామినేటెడ్ పోస్టులో వున్న మంత్రి తనయుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు అసమ్మతి నేత, మేడారం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్‌ రామ్మూర్తి ఆరోపించారు. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చందూలాల్ చిచ్చుపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.  

మరో అస్మమతి నేత, అబ్బాపురం ఎంపిటీసి పోరిక గోవిందనాయక్ మాట్లాడుతూ...మంత్రి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా చందూలాల్, ప్రహ్లాద్ లే బాధ్యత వహించాలన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి మంత్రి నుండి రక్షణ కల్పించాలని కోరనున్నట్లు గోవింద నాయక్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అసమ్మతి సెగ.. భారీ భద్రత నడుమ మంత్రి ప్రచారం

click me!