‘‘నా సోదరిని కాపాడండి’’.. సుష్మా స్వరాజ్‌ను వేడుకున్న హైదరాబాదీ

By sivanagaprasad kodatiFirst Published Oct 24, 2018, 12:56 PM IST
Highlights

దేశం కానీ దేశంలో బంధువల చెరలో మగ్గీపోతున్న తన సోదరిని కాపాడాలంటూ హైదరాబాదీ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను వేడుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మదీ బేగంను సోమాలియా జాతీయుడైన సయ్యద్ హాసన్ ఇబ్రహీంకి ఇచ్చి 2003లో వివాహం చేశారు. 

దేశం కానీ దేశంలో బంధువల చెరలో మగ్గీపోతున్న తన సోదరిని కాపాడాలంటూ హైదరాబాదీ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను వేడుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మదీ బేగంను సోమాలియా జాతీయుడైన సయ్యద్ హాసన్ ఇబ్రహీంకి ఇచ్చి 2003లో వివాహం చేశారు. వీరికి ముగ్గుకు కుమారులు, ఇద్దరు కుమార్తెలు...

ఇబ్రహీం కుటుంబంతో కలిసి పదేళ్ల పాటు హైదరాబాద్‌లోనే కాపురం పెట్టాడు. ఆ తర్వాత 2013లో భార్యాపిల్లను సోమాలియాకు పంపించి.. తను మాత్రం ఒక ఏడాది పాటు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. అనంతరం సోమాలియాకు వెళ్లకుండా అమెరికాకు మకాం మార్చాడు. దీంతో మొహమ్మదీతో పాటు పిల్లలను ఇబ్రహీం అక్కాచెల్లెల్లు హింసిస్తున్నారు.

కనీసం తినడానికి తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మొహమ్మదీ ఈ విషయాన్ని భారత్‌లోని తన సోదరుడు మొహమ్మద్ వాహీయుద్దీన్‌కి చెప్పడంతో.. అతను ట్వీట్టర్ ద్వారా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించాడు. సోమాలియాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా తన సోదరీని, ఆమె పిల్లలను రక్షించి తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. 

click me!