మునగాలలో ఆర్టీసీ బస్సు దగ్ధం: ప్రయాణీకులు సురక్షితం

By narsimha lode  |  First Published Mar 30, 2023, 9:23 AM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద   ఇవాళ  ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  ఆర్టీసీ బస్సు,  బైక్ పూర్తిగా దగ్దమయ్యాయి. 


 

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద  గురువారంనాడు  ఉదయం ఆర్టీసీ బస్సులో మంటలు   చెలరేగాయి.  ఈ ప్రమాదం నుండి  ప్రయాణీకులు  సురక్షితంగా బయటపడ్డారు. అయితే మంటల్లో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. 

Latest Videos

హైద్రాబాద్  మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు  విజయవాడ వైపునకు  వెళ్తుంది.  హైద్రాబాద్ -విజయవాడ జాతీయ రహదారి పై ఉన్న  ఇందిరా నగర్ వద్ద  బైక్ పై రైతు  వస్తున్నాడు . ఈ బైక్ ను  ఆర్టీసీ బస్సు డ్రైవర్ గమనించకుండా  నడపడంతో  బైక్ ను బస్సు ఢీకొట్టింది.  బైక్  ముందు భాగం  బస్సు కిందకు వెళ్లింది. దీంతో  బైక్ కు,  బస్సుకు మంటలు వ్యాపించాయి. బైక్ ను  బస్సు ఢీకొడంతో  బస్సు భారీగా కుదుపులకు గురైంది.  ఈ సమయంలో  బస్సులో  ఉన్న ప్రయాణీకులు  పెద్ద ఎత్తున  అరిచారు.  వెంటనే   డ్రైవర్ బస్సును నిలిపివేశాడు.  తమ లగేజీతో   ప్రయాణీకులు  బస్సు  నుండి కిందకి  దిగారు.  ప్రయాణీకులు బస్సు నుండి  కిందకు  కొద్ది క్షణాల్లోనే  ఆర్టీసీ బస్సు  పూర్తిగా మంటల్లో  దగ్ధమైంది.,  ఆర్టీసీ బస్సుతో  పాటు  బైక్ కూడా  మంటల్లో  కాలిపోయింది.ఈ ప్రమాదంలో  బైక్  నడిపిన రైతు  తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.  మరో వైపు  ఆర్టీసీ బస్సు డ్రైవర్  పోలీసుల అదుపులో ఉన్నాడు.  

గతంలో  కూడా  ఇదే  తరహలో  సూర్యా.పేట జిల్లాలో  ప్రైవేట్  బస్సు  మంటలకు  ఆహుతైంది.  ఈ ప్రమాదంలో  ప్రయాణీకులు  సురక్షితంగా  బయటపడ్డారు.  చివ్వెంల మంలం గుంపుల తిరుమలగిరి వద్ద  ప్రైవేట్ బస్సులో  మంటలు చెలరేగాయి.ఈ విషయాన్ని గుర్తించిన  డ్రైవర్  ప్రయాణీకులను అప్రమత్తం  చేశాడు.  దీంతో  ప్రయాణీకులు  బస్సు నుండి  దిగారు. ఈ ప్రమాదంలో  ప్రయాణీకులు సురక్షితంగా  బయటపడడంతో  ఊపిరి పీల్చుకున్నారు.
 

click me!