తెలంగాణ అసెంబ్లీ ముట్టికి పలు సంఘాల యత్నం.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు..

Published : Aug 05, 2023, 12:36 PM IST
తెలంగాణ అసెంబ్లీ ముట్టికి పలు సంఘాల యత్నం.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రోజున తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రోజున తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్మాస్‌గూడ గ్రీన్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించాయి. గ్రీన్ జోన్ ఎత్తివేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని  అక్కడి నుంచి తరలించారు. 

ఇక, అసెంబ్లీ ముట్టడికి మున్నూరు కాపు నేతలు కూడా యత్నించారు. మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్నూరు కాపులకు రూ. 500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీకి కొద్ది దూరంలోనే మున్నూరు కాపు నేతలను అడ్డుకున్న పోలీసులు.. వారిని  అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌