భారీ వర్షాలకు వికారాబాద్-పరిగి రోడ్డుపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో మన్నెగూడ నుండి వాహనాలను మళ్లించారు పోలీసులు.
హైదరాబాద్: భారీ వర్షాలకు వికారాబాద్- పరిగి రోడ్డుపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో ఈ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. రెండు రోజులుగా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. నిన్న మోమిన్ పేట వద్ద ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ఈ బస్సులోని ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు.
also read:మేడ్చల్ మైసమ్మగూడలో నీట మునిగిన 30 అపార్ట్‌మెంట్లు: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నిన్న ఒక్క రోజే మోమిన్ పేటలో 7.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. పరిగి-నస్కల్ గ్రామాల మధ్య వాగు రోడ్డుపై వాగు ప్రవహించింది. దీంతో మన్నెగూడ మీదుగా వాహనాలను మళ్లించారు. ఇవాళ తెల్లవారుజాము నుండి కూడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వికారాబాద్-పరిగి రోడ్డును మూసివేశారు. మన్నెగూడ నుండి వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. బషీరాబాద్ మండలంలో జుంటివాగుకు వరద పోటెత్తింది. వికారాబాద్ జిల్లాలోని పలు చెరువులు, కుంటలకు వరద పోటెత్తింది.చేవేళ్ల, షాబా్, శంకర్ పల్లి, మొయినాబాద్ మండలాల్లో కురిసిన వర్షాలతో చెరువుల్లో వరద నీరు చేరింది.