చోరీ చేసి బస్సులో నిందితులు పరారీ.. విమానంలో వెళ్లి మరీ..

By telugu news teamFirst Published Feb 23, 2021, 9:59 AM IST
Highlights

సెక్యూరిటీ గార్డు సోహిదుల్‌ అస్లాం మీద అనుమానం వ్యక్తం చేస్తూ బేకరీ నిర్వాహకుడు అమర్‌ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


బేకరీలో డబ్బు చోరీ చేసిన ముగ్గురు దొంగలు.. బస్సులో కోల్ కత్తాకు పారిపోతుండగా.. వారిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...  రోడ్డు నెంబరు 10లోని వాక్స్‌ బేకరీలో గత వారం ఏడు లక్షల రూపాయల నగదు చోరీ అయింది. సెక్యూరిటీ గార్డు సోహిదుల్‌ అస్లాం మీద అనుమానం వ్యక్తం చేస్తూ బేకరీ నిర్వాహకుడు అమర్‌ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

సీసీ కెమెరాలను పరిశీలించగా సోహిదుల్‌ అస్లాంకు ఎల్‌బీనగర్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు అలిముద్దిన్‌ షేక్‌, అక్సెదుల్‌ అలీ సహకరించినట్టు తేలింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వారు బస్సులో కోల్‌కత్తా పారిపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు విమానంలో కోల్‌కత్తాకు వెళ్లారు. నిందితులు బస్సులో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
 

click me!