షర్మిల పార్టీలో తొలి నియామకం.. అతనెవరంటే....

Published : Feb 23, 2021, 09:24 AM IST
షర్మిల పార్టీలో తొలి నియామకం.. అతనెవరంటే....

సారాంశం

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆమె వేగం పెంచారు. తన కార్యక్రమాల సమన్వయకర్తగా తొలి నియామకాన్ని చేపట్టారు. 

ఇప్పటికే ఆమె దివంగత వైయస్సార్ అభిమానులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభిమానుల సలహాలను తీసుకుంటున్నారు. ఆమెతో ఇప్పటికే పలువురు నేతలు, మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు భేటీ అయ్యారు. 

మరోవైపు షర్మిల తాను పెట్టబోతున్న పార్టీకి సంబంధించి అధికారికంగా తొలి నియామకం చేశారు. తన కార్యక్రమాల సమన్వయకర్తగా వాడుక రాజగోపాల్ ను నియమించారు. 

రాజగోపాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినవారు. వైయస్ కుటుంబంతో ఆయనకు 30 ఏళ్లుగా పరిచయం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,  రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ దయానంద్ పార్టీకి రాజీనామా చేశారు. 

గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షర్మిలకు మద్దతు ప్రకటించానని చెప్పారు.
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu