వంటచేయడానికి వచ్చి.. ఇల్లు గుల్ల చేశాడు..!

By AN TeluguFirst Published Feb 23, 2021, 9:14 AM IST
Highlights

ఇంట్లో వంటవాడిగా చేరి ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు.. ఏకంగా లక్షల రూపాయలు ఛోరీ చేసి జంప్ అయ్యాడు. చివరకు విషయం బైటపడడంతో కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్ వనస్థలి పురంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇంట్లో వంటవాడిగా చేరి ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు.. ఏకంగా లక్షల రూపాయలు ఛోరీ చేసి జంప్ అయ్యాడు. చివరకు విషయం బైటపడడంతో కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్ వనస్థలి పురంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రకాశం జిల్ల నూతనపాడు మంగనూర్ గ్రామానికి చెందిన తన్నీరు లక్ష్మీ నారాయణ (27) అనే వ్యక్తి హైదరాబాద్, వనస్థలిపురంలోని శ్రీనివాసపురం కాలనీలో ఉంటున్నాడు. వనస్థలిపురంలోనే ఉండే ఓ మహిళ ఇంట్లో వంటవాడిగా చేరాడు.

ఆమెకు ఖర్చుల నిమిత్తం అమెరికాలో ఉన్న ఆమె చెల్లెలు డబ్బులు పంపిస్తుండేది. ఆమె ఏటిఎం కార్డు, కవర్ మీదే పిన్ నెం. రాసి కార్డు ఎప్పుడూ తన టేబుల్ మీదే ఉంచుకునేది. ఈ విషయం లక్ష్మీనారాయణ గమనించాడు. 

2020 జనవరి నుంచి ఆమె చూడనప్పుడు ఏటీఎం కార్డును చాలాసార్లు తీసుకెళ్లి డబ్బులు డ్రా చేసుకుని, మళ్లీ ఏమీ తెలియనట్టు అక్కడే పెట్టేసేవాడు. అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన మెసేజ్ లు ఆమె ఫోన్ కు రాకపోవడంతో విషయం తెలియలేదు. 

ఇలా లక్ష్మీనారాయణ ఏకంగా రూ. 2.70లక్షలు ఆ మహిళ అకౌంట్ నుంచి డ్రా చేశాడు. ఇదే అదునుగా భావించిన లక్ష్మీనారాయణ ఆమె వద్ద పనిచేయడం మానేసి, చోరీ చేసిన డబ్బులతో బెంగుళూరులో జల్సా గా గడుపుతున్నాడు. 

ఈ క్రమంలో సదరు మహిళ చెల్లెలు ఇండియాకు వచ్చింది.  ఆ తరువాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమవడం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైం సిబ్బంది, వంట వాడిగా పనిచేసిన లక్ష్మీ నారాయణ చోరీ చేసినట్టు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

click me!