చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన.. హైదరాబాద్‌లో టీడీపీ నేత మాగంటి బాబుపై కేసు నమోదు..

Published : Sep 17, 2023, 09:01 AM IST
  చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన.. హైదరాబాద్‌లో టీడీపీ నేత మాగంటి బాబుపై కేసు నమోదు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబుపై హైదరాబాద్‌లో పోలీసు కేసు నమోదు అయింది. పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబుపై హైదరాబాద్‌లో పోలీసు కేసు నమోదు అయింది. పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా శనివారం ఓఆర్‌ఆర్‌పై నిరసనగా ఆ పార్టీ మద్దతుదారులు, కొందరు ఐటీ ఉద్యోగులు ప్లాన్ చేశారు. అయితే ఓఆర్ఆర్ పై వెళ్లకుండా మాగంటి బాబుతో పాటు మరికొంత మందిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాగంటి బాబుకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే మాగంటి బాబు పోలీసులపై బెదిరింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాగుంట బాబుపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.

ఇక, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా కూడా హైదరాబాద్‌లో ఆ పార్టీ మద్దతుదారులు, పలువురు ఐటీ ఉద్యోగులు నిరసనలు  చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై నిరసనలకు చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. నిరసనకారులు ఔటర్ రింగ్ రోడ్డులోని 20 ఎంట్రీ పాయింట్లలో వీలును బట్టి ప్రవేశించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓఆర్‌ఆర్‌పై నిరసన ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని  స్పష్టం చేశారు. పల

అయితే సైబరాబాద్ పోలీసులు ఖాజాగూడ సర్కిల్ సమీపంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, ఔటర్ రింగ్ రోడ్డుపై నిరసనలకు అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. అనుమానాస్పద వాహనాలను వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వాహన యజమానులు నిరసన తెలిపారు. మరోవైపు పలుచోట్ల టీడీపీ మద్దతుదారుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. నార్సింగి ఇంటర్‌చేంజ్ వద్ద హై డ్రామా ఆవిష్కృతమైంది.

అయినప్పటికీ పలువురు నిరసనకారులు ఓఆర్‌ఆర్‌ మీదకు ప్రవేశించారు. పలుచోట్ల వాహనాలతో కూడిన కాన్వాయ్‌లను ఏర్పాటు చేసుకుని నిరసన తెలియజేశారు. వాహనాల  సన్‌రూఫ్‌ల నుంచి నిలబడి చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu