ప్రేమ పేరిట బాలికను గర్భవతిని చేసి.. పెళ్లి కి కులం పేరు చెప్పి...

Published : May 23, 2020, 12:36 PM ISTUpdated : May 23, 2020, 12:37 PM IST
ప్రేమ పేరిట బాలికను గర్భవతిని చేసి.. పెళ్లి కి కులం పేరు చెప్పి...

సారాంశం

ప్రేమమాయలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట కుటుంబసభ్యులు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. 

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతను చెప్పిన మాటలను బాలిక నిజమని నమ్మింది. కాబోయే వాడే కదా అని సర్వం అర్పించుకుంది. తీరా.. అతని కారణంగా  బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని కోరగా.. తక్కువ కులం అంటూ బాలికను హేలన చేసి మాట్లాడాడు. ఈ సంఘటన రంగారెడ్డిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు  ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామానికి చెందిన మహేందర్‌ (21), బాలిక ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమమాయలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట కుటుంబసభ్యులు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. 

బాలికను వివాహం చేసుకోనని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై సీఐ చంద్రబాబును వివరణ కోరగా బాలిక ఫిర్యాదు వాస్తవమేనన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా.. పెళ్లి చేసుకోవడానికి యువకుడు కులం కారణంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu