ఇష్టం లేని పెళ్లి... ఇంట్లో నుంచి పరారైన యువతి

Published : May 23, 2020, 12:21 PM IST
ఇష్టం లేని పెళ్లి... ఇంట్లో నుంచి పరారైన యువతి

సారాంశం

తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన నానాపూరం హన్మంత్, అంజిలమ్మ కుమార్తె రాధిక. కొన్ని రోజులుగా రాధికకు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 

ఇంట్లో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువతి ఇంట్లో నుంచి పరారైంది. ఈ సంఘటన కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్‌ఐ సత్తయ్య వివరాల ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన నానాపూరం హన్మంత్, అంజిలమ్మ కుమార్తె రాధిక. కొన్ని రోజులుగా రాధికకు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 

ఈ క్రమంలోనే బుధవారం సంబంధం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలోనే రాధిక ఇంట్లో నుంచి పారిపోయింది. అయితే యువతిని తాండూరు మండలం చింతమణిపట్నం గ్రామానికి చెందిన ఆనంద్‌ తమ కుమార్తెను తీసుకెళ్లినట్లు యువతి తల్లి ఆరోపించింది. దీంతో అతడిపై శుక్రవారం కరన్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. ప్రేమ వ్యవహారమే యువతి కనిపించకుండా పోవడానికి కారణమయ్యి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యువతి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. స్నేహితులను కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

రేవంత్ రెడ్డి సమక్షంలో ఉగాది పంచాంగం | Ugadi Panchangam 2026 | Asianet News Telugu
Neem Trees: ఉగాది పూట వేప పువ్వు దొర‌క‌ని పరిస్థితి.. ఇంత‌కి వేప చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి.?